Begin typing your search above and press return to search.
నా వెయిటే నా సక్సెస్ అంటున్న కీరవాణి
By: Tupaki Desk | 2 Nov 2015 8:30 PM GMTసంగీత దర్శకుడిగా రెండున్నర దశాబ్దాల ప్రస్థానం కీరవాణిది. ఇన్నేళ్ల తర్వాత కూడా రెలెవెంట్ గా ఉండటం, తన ప్రత్యేకత చాటుకుంటూ ఉండటం గొప్ప విషయమే. మరి కీరవాణి సక్సెస్ కు కారణమేంటి.. ప్రతిభా? అదృష్టమా? ఇవేవీ కాదంటున్నాడీ స్వర మాంత్రికుడు. తన బరువే తన సక్సెస్ సీక్రెట్ అంటూ కొత్త సంగతి చెప్పాడు కీరవాణి. బరువేంటి.. సక్సెస్ సీక్రెట్ కావడమేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా.. ఐతే కీరవాణి వాదనేంటో వినండి మరి.
‘‘బాలసుబ్రమణ్యం గారిని చూశాక బరువుగా ఉంటేనే సక్సెస్ అవుతామని నిర్ణయించుకున్నా. ఇంకా చాలామంది మహానుభావులు చాలా లావుగానే ఉంటారు. వాళ్లందరూ బరువుగా ఉండటం వల్లే సక్సెస్ అయ్యారనిపించింది. అందుకే నేను కూడా బరువు పెరిగే ప్రయత్నం చేశాను. నేను హైదరాబాద్ లోని చాలా జిమ్ లకు డబ్బులు కట్టాను. వాళ్ల దగ్గర నా డబ్బులు భద్రంగా ఉన్నాయి. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ బరువు తగ్గడం కోసం అంటూ మంచి జ్యూసులేవీ ఇచ్చారు. వాటిని పద్ధతిగా మా ఇంట్లో పని చేసేవాళ్లతో తాగిస్తున్నా. బరువు తగ్గితే సక్సెస్ పోతుందేమో అని ఇలాగే కంటిన్యూ అవుతున్నా. నా అసిస్టెంట్లు - సింగర్లు కూడా బాగానే బరువెక్కుతున్నారు. అందరికీ నేను చెప్పేదొక్కటే. బరువుంటేనే సక్సెస్’’ అన్నారు కీరవాణి.
ఇంతకీ కీరవాణి ఎందుకిలా మాట్లాడాడు అంటే.. సైజ్ జీరో సినిమా కోసం అన్నమాట. లావుగా ఉన్నవాళ్లను ఎగతాళి చేయడం, వాళ్లను తక్కువ చేసి మాట్లాడటం, లావున్న వాళ్లకు పెళ్లిళ్లు కాకపోవడం.. దీని మీద సెటైరిక్ గా, సందేశాత్మకంగా తెరకెక్కిన సినిమా సైజ్ జీరో. ఆ నేపథ్యంలోనే కీరవాణి అలా మాట్లాడాడు.