Begin typing your search above and press return to search.

షాక్‌: RRR మ్యూజిక్ డైరెక్ట‌ర్ పారితోషికం ఎంతంటే!

By:  Tupaki Desk   |   5 March 2020 4:58 AM GMT
షాక్‌: RRR మ్యూజిక్ డైరెక్ట‌ర్ పారితోషికం ఎంతంటే!
X
ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా కేట‌గిరిలో తెర‌కెక్కుతోన్న ఆర్.ఆర్.ఆర్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో జాతీయ స్థాయి తార‌లు న‌టిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో ఏ విభాగంలోనూ రాజీకి రాకుండా బాహుబ‌లిని మించి తెర‌కెక్కిస్తున్నామ‌ని దాన‌య్య టీమ్ చెబుతోంది. ఆ క్ర‌మంలోనే అంచ‌నాలు పెరిగాయి.

ఖ‌ర్చు చేసే ప్ర‌తీ రూపాయి సినిమా లో విజువ‌ల్ గా క‌నిపిస్తుంద‌ని టీమ్ చెబుతోంది. జ‌క్క‌న్న దాదాపు బాహుబ‌లి కి ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీమ్ తోనే ఆర్.ఆర్.ఆర్ ని తెర‌కెక్కిస్తున్నారు. త‌న ఆస్థాన సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం కీర‌వాణి ఈ చిత్రానికి స్వరాలు స‌మ‌కూరుస్తున్నారు. మొత్తం ఎన్ని పాట‌లు ఉన్నాయో తెలియ‌దు గానీ.. కీర‌వాణి పారితోషికం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్ష‌రాలా ఈ సినిమాకు మ‌ర‌క‌త‌మ‌ణి 16 కోట్లు ఛార్జ్ చేస్తున్నారుట‌. అదే నిజ‌మైతే దేశంలోనే ఏ. ఆర్ రెహ‌మాన్ త‌ర్వాత అత్య‌ధిక పారితోషికం తీసుకున్న సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణి రికార్డుకు ఎక్కిన‌ట్లే.

అదీ సౌత్ లో అయితే కొన్నాళ్ల పాటు ఆయ‌న పేరు రికార్డుల్లో నిలిచి పోతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సంగీత దర్శ‌కుడు ఇంత పారితోషికం తీసుకోలేదు. సౌత్ స‌హా ఉత్త‌రాది నుంచి రెహ‌మాన్ మాత్రమే ఆ స్థాయికి చేరుకున్నారు. ద‌క్షిణాది లో గొప్ప సంగీత ద‌ర్శ‌కులుగా ఖ్యాతి కెక్కింది రెహ‌మాన్.. ఇళ‌య‌రాజా మాత్ర‌మే. సౌత్ సినిమాల‌కు ప‌నిచేస్తే ఎక్కువ పారితోషికం తీసుకునేది వాళ్లిద్ద‌రే. అయితే బాహుబ‌లి త‌ర్వాత కీర‌వాణి పేరు జాతీయ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కు పనిచేస్తుండ‌టం ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. తాజాగా పారితోషికం మ్యాట‌ర్ వ‌ల్ల పెద్దాయ‌న పేరు సోష‌ల్ మీడియా లో మ‌రింత వైర‌ల్ అవుతోంది.