Begin typing your search above and press return to search.

కీర్తిసురేష్ తో న‌వ్వుతూ న‌మ్ర‌త ఇలా

By:  Tupaki Desk   |   26 Oct 2021 7:47 AM GMT
కీర్తిసురేష్ తో న‌వ్వుతూ న‌మ్ర‌త ఇలా
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం బుజ్జి ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` పాట‌ల చిత్రీక‌ర‌ణ స్పెయిన్ లో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్‌..కీర్తి సురేష్ ల‌పై అక్క‌డ రెండు పాట‌లు షూట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యూనిట్ అంతా అక్క‌డే ఉంది. ప‌నిలో ప‌నిగా మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్ పిల్ల‌ల‌తో స‌హా భ‌ర్త‌తో క‌లిసి వెళ్లారు. ఓ వైపు మ‌హేష్‌ షూటింగ్ లో బిజీగా ఉంటూనే తీరిక వేళ‌ల్లో న‌మ్ర‌త‌తో స్పెయిన్ అందాల్ని చుట్టేస్తున్నారు. తాజాగా ఆన్ సెట్స్ లో న‌మ్ర‌మ హీరోయిన్ కీర్తి సురేష్ తో మాట మంతీ జ‌రుపుతోన్న ఓ ఫోటోని ఇన్ స్టాలో అప్ లోడ్ చేసారు.

ఇద్ద‌రూ మ‌న‌స్ఫూర్తిగా న‌వ్వుకుంటున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాంది. ఇందులో న‌మ్ర‌త ష‌ర్టు ధ‌రించి.. ఆపైన వింట‌ర్ కోట్ ధ‌రించారు. క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్ ని ధ‌రించారు. కీర్తి సురేష్ షూటింగ్ మోడ్ లో ఉన్నారు. డిజైన‌ర్ గౌనులో కీర్తి సురేష్ బ్యాక్ ఫీట్ ని క‌వ‌ర్ చేస్తూ తీసిన పిక్ ఇది. ఇక పాట అప్ డేట్స్ అందిస్తూ న‌మ్ర‌త ఇలా అన్నారు. ``బీటీఎస్... మీట్ ఎట్ గ్రీట్స్`` పాట ప్రోగ్ర‌స్ లో ఉంది # svp అని ట్యాగ్ చేసారు. సోషల్ మీడియాలో న‌మ్ర‌త యాక్టివ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ అప్డేట్స్ దాదాపు న‌మ్ర‌త నే ఎక్కువ‌గా అభిమానుల‌కు షేర్ చేస్తుంటారు.

సాధార‌ణంగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన త‌ర్వాత మ‌హేష్ ఫ్యామిలీతో విదేశాలు వెకేష‌న్ కి వెళ్తారు. కానీ సెకండ్ వేవ్ వ‌ల్ల ఇటీవ‌ల వెకేష‌న్ల‌కు త‌ర‌చుగా బ‌య‌ట‌కు వెళ్లలేక పోయారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ స‌తీమ‌ణి.. పిల్ల‌ల్ని కూడా స్పెయిన్ కి త‌న‌తో పాటు తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. `స‌ర్కారు వారి పాట` చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

స‌ర్కార్ వారి పాటకు ఠ‌ఫ్ కాంపిటీష‌న్

ఈసారి సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సర్కార్ వారి పాట‌కు భారీ కాంపిటీష‌న్ ఎదురు కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ మారేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా సంక్రాంతి బ‌రిలో దిగితే గ‌నుక నాలుగు సినిమాల‌తో పోటీప‌డాల్సి ఉంటుంది. ఇందులో ఆర్.ఆర్.ఆర్- రాధేశ్యామ్ - భీమ్లా నాయ‌క్ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. సంక్రాంతి ముందే ఈ సినిమాల‌న్నీ వ‌రుస‌గా రిలీజ్ క్యూలో ఉండ‌డంతో థియేట‌ర్ల సెలెక్ష‌న్ ప‌రంగా చాలా స‌మ‌స్య‌లున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. అయితే స‌ర్కార్ వారి నుంచి రిలీజ్ తేదీ విష‌య‌మై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఈ చిత్రంలో మ‌హేష్ బ్యాంక్ ల మొండి బ‌కాయిల్ని వ‌సూల్ చేసే మాస్ కుర్రాడిగా అలాగే బాధ్య‌తాయుత‌మైన బ్యాంక్ ఆఫీస‌ర్ కుమారుడిగా న‌టిస్తున్నార‌ని టాక్ ఉంది.