Begin typing your search above and press return to search.
కిచెన్ బిల్డప్పులొద్దు! ఈ హీరోయిన్ లా పొలానికెళ్లి చూడు!
By: Tupaki Desk | 8 May 2020 4:30 AM GMTలాక్డౌన్ వేళ సెలబ్రిటీ సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు బాత్రూమ్ లు కడిగారు. లిట్రిన్ లో రుద్ది రుద్ది కడిగారు. కిచెన్ లో గరిటె తిప్పారు. వంటలు వండి అందరికీ తినిపించారు. మరికొందరైతే ఇళ్లు ఊడ్చేస్తూ తైతక్కలాడారు. ఇలాంటి పరమ రొటీన్ పనుల్ని కూడా చిత్ర విచిత్రంగా చేసి చూపించారు. అదంతా సామాన్యుడి అటెన్షన్ ని తమవైపు తిప్పుకునేందుకే. సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు .. అక్కడ ప్రకటనలతో ఆర్జించేందుకు ఉపయోగపడింది.
అదంతా సరే కానీ .. ఈ హీరోయిన్ ని చూశారా? ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నేస్తోంది. అంతేకాదు.. కూలీలతో కలిసిపోయి నాట్లు కూడా వేసేస్తోంది. వ్యవసాయంలో అందె వేసిన చేయి! అన్నట్టుగానే అదరగొట్టేస్తోంది. ఇవీ గట్స్ అంటే. ఏదో నాలుగు గోడల మధ్య కంఫర్ట్ చూసుకుని గరిటె తిప్పేయడాలు.. బాత్రూమ్ లో బిల్డప్పులు కొట్టడాలు ఇవేవీ గొప్పేమీ కాదు. పరమ రొటీన్ .. సెల్ఫిష్ పనులు అని ప్రూవ్ చేసారు చాలా మంది. అయితే అందుకు భిన్నంగా ఇలా రైతన్నగా మారి మురిపిస్తున్న సదరు హీరోయిన్ ని చూస్తుంటేనే తెగ ముద్దొచ్చేస్తోంది.
ఆవిడ పేరు కీర్తీ పాండియన్. మలయాళ హీరో కమ్ విలన్ అరుణ్ పాండియన్ కుమార్తె. తుంబ అనే సినిమాతో నాయికగా పరిచయమైంది. మల్లూవుడ్ లో క్రేజీగా అవకాశాలు అందుకుంటోంది. ఇక అరుణ్ పాండియన్ రైతు.. ఆపై దర్శకనటుడిగా.. రాజకీయ నాయకుడిగానూ సుపరిచితం. కుమార్తె కూడా నాన్నగారి బాటలోనే ఆకట్టుకుంటోంది. డాడీతో కలిసి మలయాళ బ్లాక్ బస్టర్ `విలన్` తమిళ రీమేక్ లో నటిస్తోంది కీర్తి. లాక్ డౌన్ వల్ల మలయాళంలోనూ షూటింగులు నిలిచిపోయాయి కాబట్టి ఖాళీ సమయాన్ని ఇలా పొలంలో సద్వినియోగం చేస్తోంది. కీర్తి విజువల్స్ ఫోటోలు చూసి ఔరౌరా? అంటూ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమె గట్స్ ని మెచ్చుకుంటున్నారు. నాన్న పొలానికి రమ్మంటే చద్దన్నం క్యారేజీ తీసుకు రమ్మంటే నామోషీ ఫీలయ్యే బీటెక్- రొటీన్ డిగ్రీ బాబులందరికీ సిగ్గు రావాలి ఇది చూశాకైనా!!