Begin typing your search above and press return to search.
కీర్తిని పల్లవిని పిలవడానికి కారణమదేనా!
By: Tupaki Desk | 24 Feb 2022 11:00 PM ISTశర్వానంద్ నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు` మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది.
AMJ థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 27న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా నటీమణులు కీర్తి సురేష్- సాయి పల్లవి హాజరవుతారని మేకర్స్ తెలియజేసారు. ఈ చిత్రం వాస్తవానికి మహిళల గొప్పతనాన్ని చిత్రీకరిస్తుంది. ట్రైలర్ లాంచ్ కు ఇద్దరు నటీమణులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించడం సినిమా థీమ్ ప్రకారమేనని చెబుతున్నారు.
తిరుమల కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా వర్కబుల్ సబ్జెక్ట్‌ని రాశారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్న శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఖుష్బు- రాధిక శరత్ కుమార్- ఊర్వశి ముఖ్య పాత్రలు పోషిస్తున్న కొందరు నేటితరం తారలు కూడా నటిస్తున్నారు.
అయితే ట్రైలర్ ఈవెంట్ కి ప్రత్యేకించి మహానటి కీర్తిని.. ప్రతిభావని సాయి పల్లవిని ఎంపిక చేయడం వెనక కారణం ఆసక్తికరం. ఆడవాళ్లు మీకు జోహార్లు అన్న టైటిల్ కి తగ్గట్టే ఆ ఇద్దరికీ ఆ అర్హత ఉందని భావిస్తున్నట్టు వెల్లడించడం నిజంగా వారికి గౌరవం.