Begin typing your search above and press return to search.

ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా

By:  Tupaki Desk   |   25 Jan 2023 6:00 AM GMT
ఈ ఫోటోలో స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా
X
ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా... రెండు జడలతో కాటుక కళ్లతో ఉన్న ఈమె ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరోయిన్. చూసిన వెంటనే గుర్తుపట్టడం కష్టమే కానీ తదేకంగా చూస్తే మాత్రం ఆమెను కొంతసేపటికి గుర్తుపట్టేయవచ్చు. అవును మీరు అనుకున్నది కరెక్టే. ఆమె ఇంకెవరో కాదు. ప్రస్తుత స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. తల్లిదండ్రులు ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారే కావడంతో చిన్ననాటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంది కీర్తి సురేష్.

తండ్రి డైరెక్టర్ కావడంతో చిన్నప్పుడే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె గీతాంజలి అనే సినిమాతో మలయాళ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ తర్వాత రింగ్ మాస్టర్ అనే మరో సినిమా చేసింది. కానీ అది ఆమెకు కలిసి రాలేదు.

అయితే తెలుగులో ఆమె నరేష్ కుమారుడితో ఒక సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఇప్పటికీ విడుదలవలేదు. ఆమె చేసిన రెండో సినిమా నేను శైలజ సూపర్ హిట్ కావడంతో ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు. వరుసగా తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ హాట్ టాపిక్ గా మారింది.

2018లో ఆమె నటించిన మహానటి సినిమా ఆమె కెరియర్ కు అతిపెద్ద బ్రేక్. ఆ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ నటన ఇప్పటికీ అనేకమంది మనసులో నుంచి ఏమాత్రం బయటకు వెళ్లదు.

అయితే ఎందుకో ఆ సినిమా తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరమై ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది ఈ భామ. అయితే ఆ అన్ని సినిమాలు బోల్తాబడ్డాయి.

అయితే.. ఇప్పుడే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మీద కూడా కన్నేసిన కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా మారుతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి నాని దసరా మెగాస్టార్ చిరంజీవి పోలాశంకర్ సినిమాలు తెలుగులో ఉండగా తమిళంలో ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.