Begin typing your search above and press return to search.
కీర్తిని 'సర్కారువారి పాట' ఆదుకోవలసిందేనా?
By: Tupaki Desk | 8 April 2021 12:30 AM GMTటాలీవుడ్ లో టాప్ 3 హీరోయిన్స్ జాబితాలో కీర్తి సురేశ్ పేరు కనిపిస్తుంది. 'నేను శైలజ' సినిమా ద్వారా ఈ పిల్ల తెలుగు తెరకి పరిచయమైంది. బూరెల్లాంటి బుగ్గలతో పిల్ల భలేగా ఉందిరా అని కుర్రాళ్లు అనుకున్నారు. ఆమె తమ వైపు చూస్తుందేమోనని ముందువరుసలోని సీట్లలో కూర్చున్నారు. అలా కీర్తి సురేశ్ తన గ్లామర్ తో పడగొట్టేసింది .. కుర్రాళ్లను తన సినిమా థియేటర్ల చుట్టూ తిప్పేసింది. కీర్తి సురేశ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయిగానీ, విజయాలు మాత్రం అదే వరుసలో రాలేకపోయాయి.
'మహానటి' తరువాత కీర్తి సురేశ్ సరైన కథలను ఎంచుకోలేకపోయింది .. తన గ్లామర్ విషయంలోను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయింది. దాంతో కొంతకాలంగా పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. తమిళంలో 'సర్కార్'ను మినహాయిస్తే, ఆమెకి వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి. తెలుగులో ఇటీవల వచ్చిన 'రంగ్ దే' సినిమా కూడా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్రను రష్మిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు కూడా వినిపించాయి.
ఇక కీర్తి చేసిన 'గుడ్ లక్ సఖి' జూన్లో విడుదలకి సిద్ధమవుతున్నా, ఆమె అభిమానులు మాత్రం 'సర్కారువారి పాట'పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ సినిమా ఎంతవరకూ ఆదుకుంటుందన్నది చూడాలి. ఇక తమిళంలో 'సాని కాయిధమ్' . 'అన్నాత్తే' సినిమాలు, మలయాళంలో 'మరక్కార్' .. 'వాశి' సినిమాలు ఆమె కెరియర్ కి ఊరటనిచ్చేవిగానే కనిపిస్తున్నాయి. ఇకనైనా కీర్తి సురేశ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల జోలికి పోకుండా .. జీరో సైజ్ పేరు ఎత్తకుండా సినిమాలు చేసుకెళ్లడం ఉత్తమమనేది ఆమె అభిమానుల మాట.