Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఇది నెగిటివ్ వల్ల నవ్వు
By: Tupaki Desk | 18 Jan 2022 11:32 AM GMTమహానటి కీర్తి సురేష్ ఇటీవలే కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆమె కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియజేసింది. అంతే కాకుండా ఈమద్య తనతో కలిసి వారు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. కీర్తి సురేష్ కరోనా పాజిటివ్ అంటూ ప్రకటించిన వెంటనే అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు వెంటనే నయం అవ్వాలంటూ అభిమానులు ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. కీర్తి సురేష్ చాలా తక్కువ సమయంలోనే కరోనాను జయించింది. ఆమె తనకు కోవిడ్ నెగటివ్ వచ్చిందని ప్రకటించింది. కరోనాను ఇంత త్వరగా మహానటి కీర్తి సురేష్ జయించడం చాలా సంతోషంగా ఉందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ తనకు నెగటివ్ వచ్చిందంటూ ప్రకటించడంతో పాటు తన రీసెంట్ ఫొటోలను కూడా షేర్ చేసింది. నెగటివ్ వచ్చిన వెంటనే ఆమె మొహంలో వచ్చిన నవ్వు ఇదే అయ్యి ఉంటుంది. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదు అని ప్రభుత్వాలు.. వైద్యులు చెప్పినా.. ఇంకా చెబుతూనే ఉన్నా కూడా లక్షల మంది కరోనా వల్ల మృతి చెందారు కనుక ఏ ఒక్కరు కూడా లైట్ తీసుకోవడం లేదు. కనుక కీర్తి సురేష్ కూడా ఈ విషయంలో ఆందోళన చెందినట్లుగా ఆమె ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది. టెన్షన్ తో కాస్త మొహం గుంజుకు పోయినట్లుగా అనిపిస్తుంది. ఇక నెగటివ్ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో కీర్తి సురేష్ మొహం లో నవ్వు చూస్తూ ఉంటే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మేకప్ లేకుండా షేర్ చేసిన ఆ ఫొటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. తనకు కోవిడ్ లేదంటూ ఆమె షేర్ చేసిన ఫొటోలు అభిమానుల్లో పెద్ద టెన్షన్ ను దించాయి. మరో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకుని షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. వచ్చే నెలలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పునః ప్రారంభం అవ్వబోతుంది. కీర్తి సురేష్ వచ్చే నెలలో మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట షూటింగ్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సర్కారు వారి పాట సినిమా మాత్రమే కాకుండా ఇంకా పలు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో కూడా ఆమె పాల్గొనబోతుంది. వచ్చే నెల చివర్లో లేదా మార్చి నెలలో చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా పునః ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా లో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.