Begin typing your search above and press return to search.
మహానటిగా కీర్తి చేస్తున్న మహా మాయ
By: Tupaki Desk | 5 May 2018 11:55 AM GMTతెలుగు సినిమా లవర్స్ లో మాయా బజార్ ను చూడని ప్రేక్షకులు ఉండరంటే అదేమీ అతిశయోక్తి కాదు. ఆ మూవీలో ఉన్న మాయాదర్పణం సన్నివేశం ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. ఆ మాయాదర్పణం ముందు నుంచుని శశిరేఖగా సావిత్రి అభినయం.. ఎవరికైనా కను కొలకుల్లో తిరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు మహానటి మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. అంతటి మహానటి రోల్ లో ఈ మలయాళీ భామ ఎంతవరకు సెట్ అవుతుందో అనే సందేహాలు తొలుత వెలువడ్డాయి. అయితే.. తన గెటప్ అండ్ ట్యాలెంట్ తో ఈ విమర్శలు ఇప్పటికే బ్రేక్ వేసిన ఈ భామ.. ఇప్పుడు ఒక పోస్టర్ ద్వారా అందరి నోళ్లు మూయించేసింది. మాయాబజార్ మాయాదర్పణం సన్నివేశాన్ని మహానటి పోస్టర్ గా రిలీజ్ చేయగా.. ఆ దర్పణం ముందు నిలబడ్డ కీర్తి సురేష్ ను చూసిన ఎవరికైనా.. సావిత్రికి ప్రతిరూపం అనిపించక మానదు.
మహానటి టైటిల్ రోల్ లోకి కీర్తి సురేష్ ను ఎంపిక చేయడం.. ఎంత కరెక్ట్ అనే సంగతి ఇప్పుడు అందరికీ అర్ధమవుతుంది. గభాలున చూస్తే.. సావిత్రి పోస్టరేనేమో అనిపించేస్తోందంటే.. ఆ పాత్రలో కీర్తి సురేష్ ఎంతగా ఒదిగిపోయిందో అర్ధమవుతుంది. ఇక ఈ నెల 9న థియేటర్లలోకి వస్తున్న మహానటి మూవీలో దుల్కర్ సల్మాన్.. సమంత.. విజయ్ దేవరకొండ కీలక పాత్రలలో నటించారు.