Begin typing your search above and press return to search.
కీర్తిసురేశ్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇది!
By: Tupaki Desk | 13 May 2019 7:14 AM GMTఅదిగో తోక అంటే ఇదిగో పులి అనే రోజులు. అలాంటిది ఒక పార్టీ తరఫున ఎన్నికల సందర్భంలో ప్రచారం చేయటం ఒక ఎత్తు అయితే.. కొందరు ప్రముఖులతో కలిసి మోడీ వారి దర్శనం చేసుకోవటం మామూలు కానేకాదు. అలాంటివేళ.. జరిగే ప్రచారం సంగతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా రీల్ సావిత్రి.. తెలుగు.. తమిళ చిత్రాల్లో నటించిన కీర్తిసురేశ్.. తాజాగా బీజేపీలో చేరినట్లుగా భారీ ఎత్తున ప్రచారం సాగుతోంది.
దీనిపై కీర్తి సురేశ్ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఆమె ఢిల్లీలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఫోటోలు.. ఇటీవల కొందరు సినీ ప్రముఖులతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. దీంతో.. ఆమె కమలం పార్టీలో చేరారని.. కాషాయ కండువా కప్పుకున్నట్లేనని తేల్చేశారు.
అయితే.. ఇదంతా నిజం కాదని చెబుతున్నారు. బీజేపీలో రీల్ సావిత్రి చేరటంపై ఆమె రియాక్ట్ కాకున్నా.. తాజాగా ఆమె తల్లి ఈ వ్యవహారం మీద ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కీర్తి తండ్రి బీజేపీ నేతగా గుర్తింపు ఉంది. ఎన్నికల్లో ప్రచారం చేయకున్నా.. తండ్రి సూచనతో ఢిల్లీలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినట్లుగా ఆమె తల్లి మేనకా సురేశ్ వెల్లడించారు.
బీజేపీ తరఫున ప్రచారం చేసిన తర్వాత.. కొందరు సినీ నటులతో కలిసి ప్రధాని మోడీని కలిశారుకీర్తిసురేశ్. దీనిపై వివరణ ఇచ్చిన ఆమె తల్లి.. ప్రచారం ముగిసిన తర్వాత కొందరు సినిమా కళాకారులు ఢిల్లీలో మోడీని కలిశారని.. అప్పుడు ఫోటో తీశారని చెప్పారు. అంతే తప్పించి.. తాను.. తన కుమార్తె బీజేపీ సభ్యత్వానని ఇప్పటివరకూ తీసుకోలేదన్నారు. తనకు కానీ.. తన కుమార్తెకు కానీ రాజకీయాలంటే ఆసక్తి లేదని చెప్పిన మేనక మాటలే నిజమనుకుంటే.. తండ్రి సూచన ప్రకారం ప్రచారం చేసినట్లే.. రేపొద్దున పార్టీలో చేరాలని కోరితే..?