Begin typing your search above and press return to search.
కీర్తి ఎమోషనల్ లేఖలో ఏం రాసింది?
By: Tupaki Desk | 2 Jun 2022 3:37 PM GMTజీవితంలో జయాపజయాలు సహజం. ఎత్తు పల్లాల్ని చవిచూడాల్సి ఉంటుంది. గెలుపోటముల్లో ఎంతటివారైనా స్థిరచిత్తంతో వ్యవహరించాలి. ఈ విషయంలో కీర్తి సురేష్ సహనం ఎంతో గొప్పది. ఈ మలయాళీ బ్యూటీ ప్రతిభలో మేటి. అందంలో రాకుమారి. కానీ అవేవీ తనకు ఇన్నిరోజులు కలిసి రాలేదు. లక్ ఏనాడూ ఫేవర్ చేయలేదు. తాను ఆశించిన సరైన బ్లాక్ బస్టర్ ఇన్నేళ్ల కెరీర్ లో దక్కలేదు. తాను లీడ్ తీసుకుని నటించిన మహానటి బ్లాక్ బస్టర్ విజయం సాధించినా కానీ అది కమర్షియల్ ఆఫర్స్ కి బ్రేక్ వేసిందే కానీ ప్లస్ కాలేదు. ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించినా ఏవీ కలిసి రాలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించిన అజ్ఞాతవాసి తనలో తీవ్ర నిరాశను మిగిల్చింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా అయ్యింది. అయినా కానీ ఓర్పుతో సహనంతో అనుకున్నది సాధించుకునేందుకు వేచి చూసింది.
ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లు అందుకుంది. అది కూడా రెండు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో తనకు చక్కని విజయాలు దక్కాయి. ఈ ఆనందంలో కీర్తి ఎంతో ఎమోషనల్ అయ్యింది కూడా. ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్ ని కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కీర్తి సురేష్ నటించిన `సాని కాయిదం`,.. `సర్కార్ వారి పాట` చిత్రాలు పెద్ద విజయాలు అందుకున్నాయి. అదే క్రమంలో ముందుగా తన టీమ్ లకు ధన్యవాదాలు తెలిపింది. కీర్తి సురేష్ షేర్ చేసిన నోట్ లో ఇలా ఉంది. ``ప్రియమైనవారందరికీ నా మాట ఇది.. నటిగా ఉండటం అనేది హానికర ఎగుడుదిగుడు ప్రయాణం.. మనం ఎత్తులు పల్లాలను చూస్తాము. ఈ ప్రయాణం తరచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పరీక్షా సమయం లాంటిది.. ఇది ఒక దశ. ప్రపంచానికి నా అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నాకు అర్థమైంది`` అని ఎమోషనల్ నోట్ రాసింది.
నటి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో సర్కార్ వారి పాట.. సాని కాయిదం విజయాలతో ఎంతో ఆనందంగా ఉందని తాజా పరిణామం చెబుతోంది. ప్రస్తుతం పరిశ్రమలో కొనసాగుతున్న తన అందమైన ప్రయాణం గురించి కూడా కీర్తి వివరించింది. తన సినిమా సాని కాయిదం - సర్కారు వారి పాట భారీ విజయాలను అందుకోవడంతో ఇరు చిత్ర బృందాలకు కీర్తి కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయాణంలో ప్రతి దశలోనూ తనపై నమ్మకం ఉంచినందుకు దర్శకులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
కీర్తి సురేష్- సెల్వరాఘవన్ ల సినిమా సాని కాయిదంలో కీర్తి నటనకు గొప్ప పేరొచ్చింది. ఇది ఒక రకంగా లేడీ ఓరియెంటెడ్ తరహా పాత్ర. కీర్తి విలేజ్ గాళ్ గా డీగ్లామరస్ పాత్రలో నటించింది. ఇక సర్కార్ వారి పాటలో కీర్తి పూర్తిగా విరుద్ధమైన పాత్రలో కనిపించింది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎన్నారై రౌడీ రాణిగా కనిపించింది. ఈ రెండు పాత్రలు నటిగా తనకు మంచి పేరు తెచ్చాయి. ఇక సర్కార్ వారి పాట ఘనవిజయం తనకు తెలుగులో మైలేజ్ ని పెంచిందని చెప్పాలి. అందుకే కీర్తి అంతగా ఎమోషల్ అయ్యి సుదీర్ఘ లేఖను రాసింది.