Begin typing your search above and press return to search.
ఆ వెబ్ సిరీస్ ఫ్యాన్స్ జాబితాలో కీర్తిసురేష్
By: Tupaki Desk | 5 Sep 2021 2:30 AM GMTఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న మనీ హీస్ట్ వెబ్ సిరీస్ సీజన్ 5 స్ట్రీమింగ్ మొదలు అయ్యింది. ఈ స్పానిష్ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఎంతో మంది సెలబ్రెటీలు కూడా ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతున్నారు. వెబ్ సిరీస్ కంటెంట్ మరియు టెక్నీషియన్స్ ఇంకా నటీనటులు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటుంది.
మనీ హీస్ట్ వెబ్ సిరీస్ గురించి తాజాగా కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. ఇండియాలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ వెబ్ సిరీస్ గురించి ట్వీట్ చేయడం వల్ల మంచి ప్రచారం దక్కింది. కొందరు తమకు ఆసక్తి అభిరుచి కొద్ది వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఉంటే కొందరు మాత్రం ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకుని మరీ సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారట. తాజాగా కీర్తిసురేష్ కూడా మనీ హీస్ట్ గురించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
తన పెట్ డాగ్ ను పక్కన పెట్టుకుని ఫన్ గా మ్యూజిక్ ప్లే చేస్తూ నేను ఇంకా నా నైకీ ఇద్దరం కూడా స్ట్రీమింగ్ కు సిద్దంగా ఉన్నాము అన్నట్లుగా పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ కూడా ఈ వెబ్ సిరీస్ గురించి పోస్ట్ చేయడం వల్ల సౌత్ లో చాలా మందికి ఈ వెబ్ సిరీస్ మరింత దగ్గర అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ కు సంబంధించి జరుగుతున్న చర్చ కారణంగా నెట్ ఫ్లిక్స్ కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది. ఈమద్య కాలంలో చాలా మంది కొత్త సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా ఎంత మంది ఈ వెబ్ సిరీస్ అభిమానుల జాబితాలో చేరుతారో చూడాలి.