Begin typing your search above and press return to search.
మహేష్ కోసం తగ్గించుకోబోతోంది
By: Tupaki Desk | 20 Feb 2016 11:30 AM GMTఫలానా హీరోతో సినిమా అవకాశం రావాలే కానీ.. ఉచితంగా నటించేస్తా అనేస్తుంటారు హీరోయిన్లు. కానీ మాటల్ని చేతల్లో చూపించేవాళ్లు తక్కువమంది. ఐతే కీర్తి సురేష్ మాత్రం తనకు నచ్చిన హీరో కోసం పారితోషకం వదులుకోకపోయినా.. కొంచెం తగ్గించుకోనైతే తగ్గించుకుంటోంది. మహేష్ అంటే తనకెంతో ఇష్టమని.. ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే అది తన అదృష్టమేనని ఇంతకుముందోసారి చెప్పిన కీర్తి.. త్వరలోనే తన కల నెరవేర్చుకోబోతోంది. మహేష్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకు కీర్తినే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇన్ డైరెక్టుగా ఈ చిత్రంలో కీర్తినే హీరోయిన్ అని చెప్పేశాడు. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో అత్యధిక బడ్జెట్ (రూ.85 కోట్లని అంచనా)తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం కీర్తి తన పారితోషకాన్ని తగ్గించుకోవడానికి కూడా రెడీ అయినట్లు సమాచారం. రెండు వారాల వ్యవధిలో తెలుగులో ‘నేను శైలజ’, తమిళంలో ‘రజినీ మురుగన్’ లాంటి సూపర్ హిట్లు కొట్టిన కీర్తి.. వెంటనే తన పారితోషకాన్ని పెంచేసింది. ఐతే మహేష్ సినిమాకు మాత్రం తన పారితోషకమే తీసుకోబోతోందట. ఏప్రిల్ లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది.