Begin typing your search above and press return to search.
ఎట్టకేలకు కీర్తి సురేష్ మెచ్చింది
By: Tupaki Desk | 10 Jan 2019 7:00 AM IST‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కీర్తి సురేష్ కు ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వరుసగా వచ్చాయి. కాని ఆమె మాత్రం ఆచి తూచి సినిమాలను ఎంపిక చేసుకుంది. తెలుగు కంటే తమిళంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది. తెలుగులో ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయన్ గా మారి పోయింది. అంతటి క్రేజ్ వచ్చిన ఏ హీరోయిన్ అయినా నెల రోజుల్లోనే కనీసం అరడజను సినిమాలకు కమిట్ అవుతారు. కాని కీర్తి సురేష్ మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమాకు కూడా ఓకే చెప్పలేదు.
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ వద్దకు పలువురు దర్శక నిర్మాతలు ఆఫర్ లతో వెళ్లారు. కాని కీర్తి సురేష్ మాత్రం ఒప్పుకోలేదు. ఎట్టకేలకు కీర్తి సురేష్ ను ఒక కొత్త దర్శకుడు ఒప్పించాడు. ఒక లేడీ ఓరియంటెడ్ కథను కీర్తి సురేష్ కు వినిపించి మెప్పించాడు. ఆ దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ కు ఫిదా అయిన కీర్తి సురేష్ వెంటనే డేట్లు కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.
కీర్తి సురేష్ హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి అన్ని ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. ఈ మూవీని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించబోతున్నాడట. ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతికి లేదా అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.