Begin typing your search above and press return to search.
డ్యూయల్ సిమ్ ప్యాకేజ్
By: Tupaki Desk | 2 Jan 2018 4:50 AM GMTసంక్రాంతి సందడికి సమయం ముంచుకు వస్తోంది. ఎప్పటి లాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈసారి స్టార్ హీరోల బాక్స్ ఆఫీస్ యుద్ధంతో మహా రంజుగా ఉండబోతోంది. చాలా కాలం నుంచి టికెట్ కౌంటర్ల దగ్గర కొట్టుకునేంత రద్దీ ఉన్న సినిమాలు రాక మాస్ మాంచి ఆకలితో ఉంది. దీన్ని గ్రాండ్ గా బ్రేక్ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీతో రేస్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు రెండు రోజుల గ్యాప్ తో బాలకృష్ణ జైసింహ - సూర్య గ్యాంగ్ కూడా రంగంలోకి దూకబోతున్నాయి. కాని అజ్ఞాతవాసి - గ్యాంగ్ సినిమాల్లో ఒక సిమిలారిటీ సినిమా లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు సినిమాలకు హీరొయిన్ కీర్తి సురేష్ కాగా - మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఒక్కడే కావడం ఇక్కడ హై లైట్. అతనే అనిరుద్ రవిచందర్. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ గా రెండు బాషల్లోను భారీ ఎత్తున్న విడుదల కాబోతున్న ఈ సినిమాల రిజల్ట్ వీళ్ళిద్దరికీ చాలా కీలకంగా మారబోతోంది.
పవన్ కళ్యాణ్ తో కీర్తి సురేష్ మొదటిసారి జట్టు కట్టింది. ఇది కనక బ్లాక్ బస్టర్ అయితే నేరుగా స్టార్ హీరొయిన్ లిస్టులో టాప్ కు వెళ్ళిపోతుంది.త్రివిక్రమ్ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే హీరొయిన్లకు డిజైన్ చేస్తాడు కాబట్టి ఆ రకంగా తనకు ఇది మేజర్ బ్రేక్ అవుతుంది అని బలంగా నమ్ముతోంది. ఇక సిబిఐ ముసుగులో దొంగతనాలకు పాల్పడే దొంగల ముఠా కథతో రూపొందిన గ్యాంగ్ సినిమా కూడా తమిళ్ లో తనను సెటిల్ చేస్తుందని కీర్తి నమ్మకం. ఇక అనిరుద్ తెలుగులో మొదటిసారి మ్యూజిక్ ఇచ్చిన అజ్ఞాతవాసి ఆడియో ఇప్పటికే హిట్ అవ్వగా బ్యాక్ గ్రౌండ్ తో ఎలా అదరగొట్టాడో చూడడానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. గ్యాంగ్ కు కూడా అనిరుద్ మ్యూజిక్ ఇస్తుండటంతో రెండు హిట్ అయితే మాత్రం టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వరదలా రావడం ఖాయం.
తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సందడి అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. ఒంగోలు గోరంట్ల సినిమాస్ లో అడ్వాన్సు టికెట్ బుకింగ్ నిన్నటి నుంచే మొదలు పెట్టారు. 80 - 200 - 300 రూపాయలుగా అధికారికంగానే పే టిఎంలో పెట్టేసారు..