Begin typing your search above and press return to search.

చిన్నిగా కీర్తి గుడ్.. ఇక స‌ర్కార్ వారితోనే చిక్కు!

By:  Tupaki Desk   |   8 May 2022 1:30 PM GMT
చిన్నిగా కీర్తి గుడ్.. ఇక స‌ర్కార్ వారితోనే చిక్కు!
X
కెరీర్ ప‌రంగా చాలా కాలంగా ఒక బంప‌ర్ హిట్ కోసం వెయిట్ చేస్తోంది కీర్తి సురేష్. అది కూడా సూప‌ర్ స్టార్ల స‌ర‌స‌న న‌టించిన సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షిస్తోంది. కానీ ఆ రోజు ఇంత‌వ‌ర‌కూ రాలేదు. గ‌డిచిన రెండేళ్ల‌లో స‌రైన హిట్టు లేదు. అందుకే ఇప్పుడు కీర్తి ఆశ‌ల‌న్నీ స‌ర్కార్ వారి పైనే. మ‌హేష్ త‌న‌కు ల‌క్కీ ఛామ్ గా మార‌తాడ‌ని ఎంతో ఆశిస్తోంది. స‌ర్కార్ వారి పాట‌ భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ కి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర ల‌భించింద‌ని ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ చెబుతోంది.

ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్స్ జ‌న‌రేట్ అయ్యాయి. అందుకే కీర్తి చాలా ఆశిస్తోంది. అయితే SVP విడుదలకు ముందే కీర్తి తాజా OTT చిత్రం చిన్నితో హిట్ సాధించింది.

చిన్ని అందరి నుండి సానుకూల స్పందనల‌ను అందుకుంటోంది. కీర్తి నటనకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కీర్తి ఇందులో ఒక సీరియస్ రోల్ చేసింది.. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది నిజంగా మ‌హేష్ అభిమానుల‌కు న‌చ్చుతుంది. అంతేకాదు.. మహేష్ అభిమానులు ఈ లక్ ఫ్యాక్టర్ కొనసాగుతుందని SVP కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

అన్న‌ట్టు కీర్తి ఎంత‌గా ట్రై చేసినా కానీ ఎందుక‌నో త‌న‌ను అదృష్టం వ‌రించ‌లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న న‌టించిన అజ్ఞాత‌వాసి ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అయ్యింది. దాంతో త‌న ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి.

కానీ ఇప్పుడు త‌న ఫేట్ ని మారుస్తాడ‌ని మ‌హేష్ పైనే హోప్స్ పెంచుకుంది. మే 12న స‌ర్కార్ వారి పాట విడుద‌ల‌వుతోంది. ఇందులో మ‌హేష్ పూర్తి మాస్ పాత్ర‌లో క‌నిపిస్తుండ‌గా కీర్తి ట్రెడిష‌న‌ల్ అమ్మాయిగా అల‌రించ‌నుంది. ఈ సినిమాతో పాటు కీర్తి మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ లో న‌టిస్తోంది. ఇందులో చిరుకి సోదరి పాత్రలో నటిస్తోంది. అలాగే కీర్తి ఇరుగు ప‌రుగునా సంత‌కాలు చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.

కీర్తి ఖాతాలో అర‌డ‌జ‌ను ఫ్లాప్ లు నిజానికి కీర్తి సురేష్ ఎంత మ‌హాన‌టి అయినా కానీ త‌న‌కు లక్ ఏ ర‌కంగానూ ఫేవ‌ర్ చేయ‌లేదు. ఇటీవ‌ల ఏకంగా అర‌డ‌జ‌ను ఫ్లాపులు ఎదుర‌య్యాయి. పెంగ్విన్ - మిస్ ఇండియా- రంగ్ దే - అన్నాత్తే- మరక్కర్ -గుడ్ లక్ సఖి వంటి సినిమాల్లో న‌టించినా ఇవేవీ త‌న‌కు క‌లిసి రాలేదు. ఈ చిత్రాలన్నీ OTT అలాగే థియేట్రికల్ గానూ ఘోరపరాజయం పాల‌య్యాయి.