Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: కొత్తగా కనిపిస్తున్న కీర్తి సురేష్

By:  Tupaki Desk   |   17 Oct 2019 10:41 AM IST
ఫస్ట్ లుక్: కొత్తగా కనిపిస్తున్న కీర్తి సురేష్
X
'మహానటి' తర్వాత కీర్తి సురేష్ తన సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది. అలానే నగేష్ కుకునూర్ చిత్రాన్ని ఎంచుకుంది. తెలుగువాడయిన బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ కు మంచి అభిరుచికల దర్శకుడిగా పేరుంది. నగేష్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయిందట. చివరి షెడ్యూల్ నవంబర్ 11 నుంచి ప్రారంభం అవుతుందని నిర్మాతలు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈరోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం యూనిట్ కీర్తి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సింపుల్ గా ఉండే చూడిదార్ లో కీర్తి ఒక ఇంట్లో కూర్చుని నవ్వుతూ ఉంది. ఈ ఫస్ట్ లుక్ నేపథ్యం చూస్తుంటే పాతకాలం ఇల్లులా ఉంది. ఈ పోస్టర్ లో కీర్తి మరీ స్లిమ్ గా కనిపిస్తోంది. కీర్తి సురేష్ అనగానే కాస్త బొద్దుగా ఉండే రూపమే ప్రేక్షకుల మనసులో మెదులుతుంది. ఈ లుక్ చూస్తే.. కాస్త బొద్దుగా ఉంటేనే కీర్తి బాగుంటుంది అనిపించకమానదు. అయితే జీరో సైజ్ అనేది ప్రెజెంట్ ట్రెండ్ కాబట్టి ప్రేక్షకులు ఇకపై ఇలా సర్దుకుపోవాల్సిందే.

ఈ సినిమాలో అది పినిశెట్టి.. జగపతిబాబు.. రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ చిరంతన్ దాస్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ వెల్లడిస్తారట.