Begin typing your search above and press return to search.

క్రేజ్ ను క్యాష్ చేస్కోవ‌డంలో త‌డ‌బ‌డిన న‌టి

By:  Tupaki Desk   |   5 April 2021 2:30 PM GMT
క్రేజ్ ను క్యాష్ చేస్కోవ‌డంలో త‌డ‌బ‌డిన న‌టి
X
మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌తో అనుష్క‌.. ప్రియ‌మ‌ణి లాంటి నాయిక‌లు చాలా కాలం పాటు ఏలారు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఆ ఇద్ద‌రూ అవ‌కాశాలు అందుకున్నారు. న‌య‌న‌తార ద‌శాబ్ధాల పాటు త‌లైవిగా ఏల్తున్నారు. ఆ త‌ర్వాత స‌మంత క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో హిట్లు కొడుతూనే నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో మెరుపులు మెరిపిస్తున్నారు.

కానీ వీళ్లంద‌రి కంటే గొప్ప ప్ర‌తిభావ‌ని అని గుర్తింపు ఉండీ తాను ఆశించిన నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో పూర్తిగా ఫ్లాప‌వుతోంది కీర్తి సురేష్. మ‌హాన‌టిలో మేటి క్లాసిక్ నాయిక‌ సావిత్రిగా ఎంతో గొప్ప‌గా అభిన‌యించిన కీర్తి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. ఆ క్ర‌మంలోనే తెలుగుతో పాటు బాలీవుడ్ చిత్రానికి సంత‌కం చేసింది. ఎడా పెడా నాయికా ప్ర‌ధాన చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. కానీ తాను లీడ్ చేసిన సినిమాలేవీ త‌న‌కు క‌లిసి రాలేదు. బాక్సాఫీస్ విజేత‌లుగా నిల‌వ‌డం లేదు.

ఇంత‌కుముందు ఓటీటీలో రిలీజైన పెంగ్విన్ దారుణంగా ఫెయిలైంది. మ‌రో సినిమా మిస్ ఇండియా ఫలితంపైనా హోప్ లేకుండా పోయింది. నాయికా ప్రధాన చిత్రం గుడ్ లక్ సఖి రిలీజ్ కి రావాల్సి ఉంది. దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించ‌లేం. ఇక‌పోతే ఇటీవ‌లే రిలీజైన రంగ్ దే చిత్రంలో కీర్తి న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. సినిమా వ‌సూళ్లు ఫ‌ర్వాలేద‌నిపించా‌యి.

ఇక బాలీవుడ్ సినిమా నుంచి త‌ప్పుకున్న కీర్తి ప్ర‌స్తుతం పూర్తిగా తెలుగు-త‌మిళ‌ చిత్రాల‌పైనే దృష్టి సారించింది. ముఖ్యంగా మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కార్ వారి పాట‌.. ర‌జ‌నీ అన్నాథే చిత్రాలు త‌న‌కు పెద్ద బ్రేక్ నిస్తాయ‌ని ఆశిస్తోంది. కీర్తికి స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితేనే వ‌రుస‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకోగ‌ల‌దు. అలాగే మ‌హిళా పాత్ర‌ల‌తోనూ పెద్ద స‌క్సెస్ సాధించాల్సి ఉంటుంది. కానీ ఇక‌పై ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాలి.