Begin typing your search above and press return to search.
కేరళకు 'మహానటి' భారీ విరాళం..
By: Tupaki Desk | 21 Aug 2018 4:54 AM GMTవెండితెర మహానటి.. హీరోయిన్ కీర్తి సురేష్ కేరళ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వరదలో చిక్కుకున్న లక్షలాది మందికి కనీసం కూడు, గూడు లేని నిస్సహాయ స్థితిలో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారికి ఆపన్నహస్తం అందించేందుకు కీర్తి సిద్ధమయ్యారు. ఇటీవల వరుసగా కేరళ బాధితుల కోసం సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ కోవలోనే ‘మహానటి’ కీర్తి సురేష్ కూడా భారీ సాయాన్ని ప్రకటించారు.
స్వతహాగా మలయాళీ అయిన కీర్తి సురేష్ తన సొంత రాష్ట్రం వరదల్లో చిక్కుకుపోవడాన్ని చూసి తట్టుకోలేక కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు - ట్రాన్స్ పోర్ట్ - బట్టలు - నిత్యావసర వస్తువులు - మందుల కోసం మరో రూ.5లక్షలను విరాళంగా ప్రకటించింది.
అంతేకాదు.. తన సొంతూరులోని బాధితులను ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. త్రివేండ్రంలోని ఓ కళాశాలలో బాధితులకు అవసరమైన దుస్తులు - ఆహార పొట్లాలను ఉంచి బాధితులకు సరఫరా చేసే బాధ్యతను భుజానికెత్తుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలను తాజాగా తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో కీర్తి చేసిన ఈ గొప్ప పనులను సోషల్ మీడియాలో అందరూ మెచ్చుకుంటున్నారు.