Begin typing your search above and press return to search.
క్లిక్ క్లిక్ః సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న బుల్లి 'మహానటి'
By: Tupaki Desk | 11 March 2021 7:15 AM GMTఅమ్మ.. అమ్మమ్మ ఇద్దరు కూడా సినిమా రంగంలో ఉన్న వారే అవ్వడంతో చాలా సింపుల్ గానే కీర్తి సురేష్ కు వెండి తెర అరంగేట్రం ఛాన్స్ దక్కింది. కాని వారసులంతా కూడా స్టార్స్ అయ్యి పోలేరు. ట్యాలెంట్ ఉన్న వారికి మాత్రమే అవకాశాలు దక్కతూ ఉంటాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంది అంటే ఖచ్చితంగా ఆమె ప్రతిభ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి మహానటితో సౌత్ ఆడియన్స్ అందరి మనసు దోచుకున్న కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ తెరపై సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కీర్తి సురేష్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈసారి ఆమె చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
సోషల్ మీడియాలో స్టార్స్ చిన్నప్పటి ఫొటోలు అనగానే నెటిజన్స్ ఆసక్తి చూపించడంతో పాటు షేర్ చేయడం కామెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కీర్తి సురేష్ ఫొటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రెగ్యులర్ గా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ ఫొటోల్లో కొన్నింట్లో కీర్తి సురేష్ మరీ గుర్తు పట్టనంత చిన్న పాపాయిగా ఉంది. అయినా కూడా ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బుల్లి మహానటి అంటూ నెటిజన్స్ ఆ ఫొటోలకు కామెంట్లు పెడుతూ షేర్ లు చేస్తున్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ అవ్వడం వల్ల కీర్తి సురేష్ చిన్నప్పటి ఫొటోలు చాలా చాలానే ఉన్నాయి.