Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌ గా కీర్తి సురేష్‌ మెమోరీ

By:  Tupaki Desk   |   24 May 2021 7:30 AM GMT
ఫొటోటాక్‌ః సూపర్‌ స్టార్‌ బర్త్‌ డే స్పెషల్‌ గా కీర్తి సురేష్‌ మెమోరీ
X
సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ సినిమా రంగంకు చెందిన కుటుంబం నుండి వచ్చిన విషయం తెల్సిందే. ఇండస్ట్రీ వర్గాల్లో సుదీర్ఘ కాలంగా కీర్తి సురేష్‌ ఫ్యామిలీ కొనసాగుతూ వస్తున్నారు. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ తో కీర్తి సురేష్‌ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో మోహన్‌ లాల్‌ తో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. మోహన్ లాల్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆమె ఈ ఫొటోను షేర్‌ చేసింది. మోహన్ లాల్‌ ను ఒక కంప్లీట్ యాక్టర్‌ అంటూ కీర్తి సురేష్ కీర్తించింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ ఏడాది కూడా మీకు మరింత విజయాన్ని తెచ్చి పెట్టాలంటూ కోరుకుంది.

ఈ ఫొటోలో కీర్తి సురేష్ చాలా క్యూట్‌ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 1990 ల్లో మోహన్‌ లాల్‌ ఎలా ఉండేవాడో మరోసారి కీర్తి సురేష్‌ చూపించింది. అందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన అభిమానులు కూడా నెట్టింట స్పందించారు. అప్పుడు ఆయన పక్కన నిల్చుని ఒక ఫ్యాన్‌ గర్ల్‌ గా ఫొటో దిగిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఆయన మలయాళంలో చేస్తున్న బిగ్గెస్ట్ మూవీలో కీలక పాత్రలో నటించబోతుంది. మోహన్ లాల్‌ తో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైట్‌ గా ఉన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.

ఇక కీర్తి సురేష్ మహానటి తర్వాత తెలుగు తమిళంలో చాలా బిజీ అయ్యింది. మలయాళం మరియు హిందీల నుండి కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో ఈమె మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. మొత్తానికి ఈమె నటిస్తున్న మరియు నటించబోతున్న సినిమాలతో మరింతగా స్టార్‌ డం ను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కు ఈ సమయంలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్‌ మీడియా పోస్ట్‌ ను పెట్టింది కీర్తి.