Begin typing your search above and press return to search.
కీర్తి డిమాండ్లు ఎక్కువయ్యాయా?
By: Tupaki Desk | 30 Jan 2019 9:12 AM GMTరామ్ హీరోగా కిషోర్ తిరుమల రూపొందించిన `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది తమిళ సోయగం కీర్తిసురేష్. బొద్దుగా వుండే ఈ చిన్నది ఆ తరువాత టాలీవుడ్ లో కోలీవుడ్ ని మించి పాపులర్ అయింది. వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ క్రేజీ కథానాయికగా పేరు తెచ్చుకుంది. అటుపై దర్శక నిర్మాతలను కొత్త డిమాండ్ లతో వేధిస్తోందని ప్రచారం జరుగుతోంది.
సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ రూపొందించిన `మహానటి` కి ముందు కీర్తి వేరు .. ఇప్పటి కీర్తి వేరు. ఈ అమ్మడు ఒక్కో కమిట్ మెంట్ కి 2-3 కోట్లు డిమాండ్ చేస్తోందిట. అలాగే మహానటికి ముందు రెండు కోట్ల పారితోషికం అందుకుందన్న ప్రచారం ఉంది. మహానటిలో అద్భుత నటనతో సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసి విమర్శకుల చేతే శభాష్ అనిపించుకున్న తర్వాత సీన్ కూడా మారిందిట. ఆ తరువాత నుంచి నటిగా తారాస్థాయి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటుపై కీర్తి దర్శకనిర్మాతలకు కొత్త డిమాండ్లు పెడుతోందట. పారితోషికం మాట అటుంచితే.. తను నటించే సినిమాలో తప్పకుండా తన బామ్మ గారికి ఓ చిన్న పాత్ర ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని కోలీవుడ్ లో ఓ వార్త షికారు చేస్తోంది.
అయితే దీనిపై కోలీవుడ్ మీడియా సెటైర్లు వేయడంతో వెంటనే కీర్తి ఓ క్లారిటీ ఇచ్చింది. ``మా బామ్మ కోసం దర్శకనిర్మాతలను డిమాండ్ చేస్తున్నానని - వారిని ఇబ్బంది పెడుతున్నానని వస్తున్న వార్తల్ని చూస్తే నవ్వొస్తోంది. మా బామ్మకు అవకాశాలు ఇవ్వండి అని నేనెప్పుడూ ఎవరినీ అడగలేదు. ఎందుకంటే నాలాగా ఆమె ఫుల్ టైమ్ యాక్టర్ కాదు. ఆమె కోసం వస్తున్న వార్తల్ని చూసి మా కుటుంబ సభ్యులంతా పగలబడి నవ్వుతున్నారు`` అని చెప్పింది. కీర్తి సురేస్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోందన్న ప్రచారం ఉన్నా దాని వివరం పూర్తిగా లేదు. అటుపై ఇంతవరకూ వేరొక సినిమాకి సంతకం చేయలేదు. అటు కోలీవుడ్ లోనూ వేరొక ప్రాజెక్టుకి కమిటవ్వలేదు. మలయాళంలో మాత్రం మోహన్ లాల్ కథానాయకుడిగా ప్రియదర్శన్ రూపొందిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం `మరక్కార్- అరవిక్కడలంటే సింహం`లో నటిస్తోంది. కీర్తి అన్ ఎక్స్ పెక్టెడ్ డిమాండ్ల వల్ల సినిమాలు తగ్గాయా? లేక తనే సంతకాలు చేయడం లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.