Begin typing your search above and press return to search.

తేనెటీగల దాడిని ఎదుర్కొన్న స్టార్ హీరోయిన్..!!

By:  Tupaki Desk   |   28 July 2020 9:00 AM IST
తేనెటీగల దాడిని ఎదుర్కొన్న స్టార్ హీరోయిన్..!!
X
మహానటి ఫేమ్ కీర్తిసురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్.. ఇటీవలే భారీ అంచనాలతో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మహానటి సినిమా తరువాత కీర్తి చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఇది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడమే మైనస్ అన్నారు. అదే థియేటర్లలో అయితే కలెక్షన్స్ వేరేలా ఉండేవి. కానీ ఈ సినిమాకి ప్లస్ ఏంటంటే తక్కువ బడ్జెట్. తక్కువ బడ్జెట్లో కేవలం కీర్తి తప్ప వేరే పెద్ద నటీనటులు ఎవరు లేరు. అంతేగాక లొకేషన్ల కోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన పనిలేకుండా ఒకే చోట షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఈ మూవీలో కీర్తి నటనకి ప్రేక్షకుల నుండి ఫిల్మ్ క్రిటిక్స్ వరకు అంతా ప్రశంసించారు. అయితే ఈ సినిమాలో చార్లీ చాప్లిన్(మాస్క్ మ్యాన్)గా నటించిన ముథాజగన్ ఈ సినిమా టైంలో జరిగిన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకున్నాడు.

టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో తెరకెక్కిన పెంగ్విన్ మూవీతో ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సస్పెన్సు థ్రిల్లరుగా రూపొందించిన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు ఆయన చెప్పుకొచ్చాడు. "కీర్తితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె చాలా టాలెంటెడ్. ఎలాంటి సీన్ అయినా చాలా శ్రద్దగా ఈజ్ తో నటిస్తుంది. మనిషిగా కూడా చాలా మంచిది కీర్తి. మేం షూటింగ్ టైంలో చాలా దాడులను ఎదుర్కొన్నాం. అందులో ఎద్దులు, వీధికుక్కలు, తేనెటీగలు ఉన్నాయి. చిత్రయూనిట్ పలుమార్లు ఈ దాడులను ఎదుర్కొన్నాం. దాదాపు నన్ను వంద వరకు తేనెటీగలు కుట్టాయి. ఇక నా పాత్ర చార్లీ చాప్లిన్. కష్టమైనదే.. ఆ పాత్ర కోసం నా నోరు కూడా కొట్టేసారు. మేకప్ కిట్లు కూడా ఫారెన్ నుండి తెప్పించారు దర్శకనిర్మాతలు" అని వెల్లడించాడు ముత్తజగన్. మొత్తానికి మోస్తరు హిట్ అందుకున్న ఈ సినిమా తర్వాత కీర్తి మరో రెండు లేడి ఓరియెంటెడ్ మూవీస్ మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చేస్తుంది. అదే విధంగా రంగ్ దే, సర్కారు వారి పాట మూవీస్ కూడా చేస్తుంది.