Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ తో బెల్లంకొండ

By:  Tupaki Desk   |   18 Jan 2018 5:00 AM IST
పవన్ హీరోయిన్ తో బెల్లంకొండ
X
హీరోల వారసుల కి ఉన్నంత క్రేజ్ డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్ల కొడుకలకి ఉండదు అనే చెప్పుకోవాలి. హీరో కొడుకుగా వచ్చి స్టార్ రేంజ్ కి వెళ్లిపోయిన చాలా మందిని మనం టాలీవుడ్ లో చూసాం. కానీ నిర్మాత లేదా దర్శకుడి కొడుకుగా వచ్చి హీరో గా సెటిల్ అయిన వాళ్ళు తక్కువనే మాట వాస్తవం. అలా ఒక నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

స్టార్ హీరోయిన్లు మరియు స్టార్ డైరెక్టర్లతో జతకడుతూ ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసిన బ్లాక్ బస్టర్ అనే మాట మాత్రం ఇంకా ఇతనికి అందని ద్రాక్షగానే ఉండిపోయింది. తన నటనా శక్తి తో ఇంకా ఇండస్ట్రీ లో నిలదొక్కుకో గలుగుతున్నాడు. శ్రీనివాస్ మరుసటి చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో వస్తోన్న సాక్ష్యం అనే సినిమా. ఇందులో డీజె హీరోయిన్ పూజా హెగ్డే ఇతగాడి పక్కన నటించబోతోంది. ఇదిలా ఉండగా మన హీరో అపుడే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచేయడం విశేషం. దినికి ఓంకార్ డైరెక్టర్. ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ నేపధ్యంలో సాగబోతున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతోంది.

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన కీర్తి ఇపుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో జతకట్టబోతోంది. ఈ సినిమాలో నటించడానికి నిర్మాతలు ఈమెకు భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. సాక్ష్యం సినిమా షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.