Begin typing your search above and press return to search.

బరువెక్కి ప్రయోగం చేయలేను

By:  Tupaki Desk   |   29 April 2018 7:30 AM GMT
బరువెక్కి ప్రయోగం చేయలేను
X
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే ఫిట్ నెస్ పై చాలా జాగ్రత్తలు తీలుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి అందరికి తెలిసే ఉంటుంది. హీరోయిన్స్ కొంచెం బరువెక్కినా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. సోషల్ మీడియాలో కామెంట్స్ ట్రాల్స్ వస్తూనే ఉంటాయి. దీంతో ఆఫర్స్ కి కూడా గండి పడుతుంది. అందుకే ఏ హీరోయిన్ అయినా సినిమాల కోసమైనా సరే లావుగా అవ్వడానికి మ్యాక్సీ మమ్ ఒప్పుకోదు. ముఖ్యంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ అయితే ఎంత మాత్రం ఒప్పుకోరు.

రీసెంట్ గా క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ ని కూడా లావుగా అవ్వాలని ఓ దర్శకుడు చెప్పాడట. కానీ అమ్మడు స్వీట్ గా నో చెప్పేసిందని తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు.. సావిత్రి బయోపిక్ మహనటిని డైరెక్ట్ చేస్తోన్న నాగ్ అశ్విన్. మహానటి లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. అయితే సావిత్రి పెళ్లి తరువాత కెరీర్ డీలా పడినప్పుడు కాస్త లావుగా కనిపిస్తుంది. అలాంటి ఎపిసోడ్ సీన్స్ కోసమని దర్శకుడు నాగ్ అశ్విన్ కీర్తిని లావవ్వమని కోరగా.. లవాయితే అవకాశాలు రావు కదా అని నో చెప్పేసిందట కీర్తి.

ఇప్పుడిపుడే కీర్తి కెరీర్ ఊపందుకుంటోంది. స్టార్ దర్శకులు హీరోలు ఆమెను ఎంచుకుంటున్నారు. అందువల్ల బరువెక్కి ప్రయోగం చేయలేను అని చెప్పేశారట. సావిత్రి బయోపిక్ లో కీర్తి దాదాపు 150 రకాల కాస్ట్యూమ్స్ దరించిందట. ప్రస్తుతం ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సినిమా పాటలకు కూడా ఆదరణ బాగానే వస్తోంది. మరి అనుకున్న స్థాయిలో మహనాటి మెప్పిస్తుందో లేదో చూడాలి.