Begin typing your search above and press return to search.

లిప్ స్టిక్ పెదాలతో కైపుగా కవ్విస్తున్న సర్కారు సుందరి!!

By:  Tupaki Desk   |   27 Jan 2021 1:30 AM
లిప్ స్టిక్ పెదాలతో కైపుగా కవ్విస్తున్న సర్కారు సుందరి!!
X
దక్షిణాది యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే మహానటి సావిత్రి బయోపిక్ చేసినప్పటి నుండి కీర్తిని మహానటిగానే గుర్తుంచుకున్నారు ప్రేక్షకులు. ఈ అమ్మడు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉందట. అంతేగాక అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, ఇటు హీరోల సరసన సినిమాలలో నటిస్తుంది. నేనుశైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కీర్తి. తర్వాత నేను లోకల్, మహానటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అమ్మడు. ఇంతవరకు కీర్తి తన సినిమాలలో ఎలాంటి స్కిన్ షో గాని, రొమాన్స్ సన్నివేశాలు చేయలేదంటే నమ్మాల్సిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరో నితిన్ సరసన రంగ్ దే, పవర్ పేట సినిమాలు చేస్తున్న ఈ వయ్యారి.. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చేస్తోంది. హీరోల సరసన సినిమాలతో పాటు 'గుడ్ లక్ సఖి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది కీర్తి.

ఇక ఈ విషయాలు పక్కన పెడితే కీర్తి మొదటి నుండి కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ముఖ్యంగా అమ్మడు ఫోటో షూట్స్ లకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇంస్టా వేదికగా కీర్తి ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ పిక్ చూస్తే ఎలాంటి కుర్రడైనా కీర్తి అందానికి దాసోహం అవ్వాల్సిందే అలా ఉంది మరి ఈ కన్నడ సుందరి సోయగం. నిజానికి కీర్తి ఒక్కసారి కూడా తన స్కిన్ షో చేయలేదు. అలాగని నడుము కూడా చూపించలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజిలో మెయింటైన్ చేస్తోంది. తాజా ఫోటోలో స్కర్ట్ ధరించి అలా లూస్ హెయిర్ పట్టుకొని లుక్కిచ్చింది. అంతే అమ్మడి లుక్స్, లిప్ స్టిక్ పెదాలు చూస్తూ కుర్రకారు కలల్లో తేలిపోతున్నారు. ఇదిలా ఉండగా సమ్మర్ లో కీర్తి నటించిన రెండు సినిమాలు ఒకేరోజు సందడి చేయనున్నాయని సమాచారం. చూడాలి మరి కీర్తి ఏం చేస్తుందో!