Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ గ్లామర్ డోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..

By:  Tupaki Desk   |   3 Jan 2023 8:30 AM GMT
కీర్తి సురేష్ గ్లామర్ డోస్.. ఎంత క్యూట్ గా ఉందొ..
X
చూడగానే అందమైన చిరునవ్వుతో అబ్బాయిలను మంత్ర ముగ్దులను చేసే కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మాత్రం ఎక్కువగా గ్లామర్ తో అయితే కనిపించింది లేదు. వీలైనంతవరకు పక్కింటి అమ్మాయి తరహాలో చాలా సింపుల్ గా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక సినిమా ఇండస్ట్రీలో ఆమెకు రేంజ్ పెరుగుతున్న కొద్ది కూడా మెల్లగా గ్లామర్ డోస్ కూడా పెరుగుతోంది.

మహానటి సినిమాలో సావిత్రి గా కనిపించిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా ఈ బ్యూటీ రేంజ్ అయితే అసలు తగ్గలేదు. ఇక అప్పుడప్పుడు మాత్రం ఫ్యాషన్ ప్రపంచంలో తన క్రేజ్ పెంచుకునే విధంగా గ్లామర్ డోస్ అయితే పెంచుతొంది. ఇక కీర్తి సురేష్ ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే అక్కడ అమ్మడు చాలా అందంగా నడుచుకుంటూ వస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో కీర్తి సురేష్ ఎంతో క్యూట్ గా ఉన్నప్పటికీ కూడా గ్లామర్ డోస్ మాత్రం అసలు తగ్గలేదు అని అనిపిస్తోంది.

ఆమె నవ్వుతోనే ఆ ఫోటోకు సగం అందం వచ్చింది అని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఆమె గత ఎడాది మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో చాలా మంచి సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా నాని బిగ్ బడ్జెట్ మూవీ దసరా త్వరలో విడుదల కాబోతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా సిస్టర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తమిళంలో కూడా ఈ బ్యూటీ మరో రెండు పెద్ద సినిమాలు చేస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి కానీ ఈ బ్యూటీ ఎందుకు అటువైపు ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.