Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ తో జత కట్టబోతున్న మహానటి?

By:  Tupaki Desk   |   8 Nov 2021 7:30 AM GMT
పుష్ప రాజ్ తో జత కట్టబోతున్న మహానటి?
X
అల్లు అర్జున్ పుష్ప పార్ట్‌ 1 చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. వచ్చే నెలలో సినిమా విడుదల కావాల్సిన నేపథ్యంలో అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మరియు పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసి ఫస్ట్‌ కాపీ సిద్దం చేయబోతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా లో అల్లు అర్జున్‌ మాస్ లుక్ అందరికి షాకింగ్ గా ఉన్న విషయం తెల్సిందే. పుష్ప పార్ట్‌ 1 తర్వాత వెంటనే పార్ట్ 2ను మొదలు పెట్టకుండా మద్యలో ఒక సినిమాను బన్నీ చేయబోతున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఐకాన్‌ ను గ్యాప్ లో చేయాలనుకున్నారు. కాని బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా తాజా సమాచారం.

ఇటీవలే అల్లు అర్జున్ మరియు బోయపాటి ల కాంబో కన్ఫర్మ్ అయ్యింది. అల్లు అరవింద్ ఈ ప్రాజెక్ట్‌ విషయంలో చాలా ఇంట్రెస్ట్‌ గా ఉన్నాడట. వచ్చే రెండు మూడు నెలల్లోనే సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే కేవలం నాలుగు అయిదు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. కథ ఓకే అయ్యింది.. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ టీమ్ తో కలిసి బోయపాటి స్క్రిప్ట్‌ పనుల్లో నిమగ్నమై ఉన్నాడంటూ సమాచారం అందుతోంది. ఇదే సమయంలో అల్లు అర్జున్‌ కు జోడీగా కీర్తి సురేష్ ను నటింపజేసేందుకు గాను గీతా ఆర్ట్స్ టీమ్ వారు ఇటీవలే ఆమెను సంప్రదించారట. బన్నీతో నటించేందుకు ఆమె ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది.

మొత్తానికి అల్లు అర్జున్‌ హీరోగా కీర్తి సురేష్‌ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌ లో ఒక సినిమా కన్ఫర్మ్‌ అయ్యిందని మెగా వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత కాని దసరాకు కాని ఈ సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. బన్నీ పుష్ప సినిమా తో ఒక భారీ ప్రాజెక్ట్‌ గా చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనుకున్నట్లుగానే సినిమా ఆ రేంజ్ లో ఉంటుందనే నమ్మకం కలుగుతోంది. ఇక బోయపాటితో ఇప్పటికే సరైనోడు సినిమాను చేసిన బన్నీ అప్పటి వరకు తన కెరీర్ లో ఉన్న సినిమాల రికార్డులను బద్దలు కొట్టి కెరీర్‌ బెస్ట్‌ గా సరైనోడు నిలిచింది. ఆ సినిమా లో బన్నీని ఎంత మాస్ గా చూపించాలో అంతటి మాస్ గా బోయపాటి చూపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో మరో పవర్‌ ప్యాక్ మాస్ బ్లాక్ బస్టర్ రాబోతుంది అంటున్నారు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్‌.. కీర్తి సురేష్ కాంబో చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.