Begin typing your search above and press return to search.
మూడో అజ్జాతవాసి లక్ ఎలా ఉందో
By: Tupaki Desk | 9 May 2018 5:37 AM GMTఈ ఏడాదిలో టాలీవుడ్ లో మొట్టమొదట రిలీజయిన పెద్ద సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది కాస్తా తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. హీరోయిన్లుగా నటించిన మళయాళ భామలు అను ఇమ్మానుయేల్.. కీర్తి సురేష్ కూడా చాలానే నిరాశ పడ్డారు.
అజ్ఞాతవాసి తరవాత పవర్ స్టార్ సినిమాలకు వీడ్కోలు చెప్పేశాడు. ఫుల్ టైం రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. ఈరకంగా ఈ మూవీ ఫ్లాప్ పవన్ సినిమా కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కు తిరిగి మెగా ఫ్యామిలీలోనే హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా అనుకు నిరాశే మిగిల్చింది. నా పేరు సూర్య ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. దానికితోడు ఇందులో అను ఇమ్మానుయేల్ పాత్ర పెద్దగా లేకపోవడంతో ఆమె కెరీర్ కు ఈ మూవీ ఏరకంగా ప్లస్ కాలేదు.
అజ్ఞాతవాసి రెండో హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాథతో వస్తున్న మహానటి టైటిల్ రోల్ లో కీర్తి నటించింది. ఈ మూవీ ప్రేక్షకుల ఈ 9న ముందుకొస్తోంది. అజ్ఞాతవాసిలో పవన్.. అనులకు దక్కని లక్కు కీర్తికి దక్కుతుందా.. ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనేది తొందరలోనే తెలియబోతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.