Begin typing your search above and press return to search.
అమ్మ బయోపిక్ లో కీర్తి సురేష్?
By: Tupaki Desk | 8 May 2018 11:31 AM GMTఅలనాటి అందాల తార - లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి`బయోపిక్ రేపు విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మహానటి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేష్ వెండితెరపై చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. సావిత్రి పాత్రకు మరే హీరోయిన్ న్యాయం చేయలేదేమో అన్నంతగా ...కీర్తి సురేష్ గెటప్ ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే కాబోలు....ఈ బయోపిక్ విడుదలక కాకముందే కీర్తి సురేష్ కోసం మరో ప్రతిష్టాత్మక బయోపిక్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - దివంగత జయలలిత బయోపిక్ కోసం కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే....త్వరలోనే తాను ఓ తమిళ బయోపిక్ లో నటించబోతున్నానంటూ...కీర్తి సురేష్ పరోక్షంగా జయలలిత బయోపిక్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఆ పుకార్లకు ఊతమిస్తోంది.
తాజాగా `మహానటి`ప్రమోషన్స్ లో భాగంగా కీర్త సురేష్ ఓ మీడియా చానెల్ తో ముచ్చటించిన సందర్భంగా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మహానటి రిలీజ్ తర్వాత తాను నటించబోయే తమిళ బయోపిక్ వివరాలు ప్రకటిస్తానని చెప్పింది. జయలలిత బయోపిక్ లో కీర్తి సురేష్ ను దాదాపుగా ఎంచుకున్నట్లేనని కోలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రకారం కీర్తిని ..ఆ ప్రాజెక్టు నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. అన్నీ ఫైనల్ అయితే, తమిళ-తెలుగు భాషల్లో ఒకే సారి షూట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉన్న కీర్తి...అమ్మ పాత్రకు న్యాయం చేస్తుందని ఆ నిర్మాతలు భావించారట.అయితే, ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జయలలిత నట ప్రస్థానం...వ్యక్తిగత జీవితం..... రాజకీయ అరంగేట్రం....మరణం వంటి ఎన్నో ఆసక్తికర ఘట్టాలున్న ఆ బయోపిక్ లో కీర్తి సురేష్ నటిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.