Begin typing your search above and press return to search.

లుక్స్ తోనే హైప్ పెంచుతున్నారు

By:  Tupaki Desk   |   22 April 2018 7:24 AM GMT
లుక్స్ తోనే హైప్ పెంచుతున్నారు
X
మే 9న విడుదల కానున్న మహానటి కోసం ఎదురుచూపులు మొదలైపోయాయి. టీజర్ వచ్చాక సినిమా ఎలా ఉండబోతోంది అనే ఐడియా రావడంతో సావిత్రి గారి అభిమానులే కాక ఆవిడను పాత సినిమాల్లో చూసిన ఇప్పటి తరం కూడా దీని మీద ఆసక్తి పెంచుకుంటున్నారు. దానికి తోడు కీర్తి సురేష్ టైటిల్ రోల్ చేస్తుండటంతో యూత్ కూడా దీని పట్ల క్రేజీ గా ఉంది. ఇక పోతే పోస్టర్స్ రూపంలో యూనిట్ విడుదల చేస్తున్న బిట్స్ ఆసక్తిని అమాంతం పెంచుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్న స్టిల్ అప్పటి కాలంలో సావిత్రి గారి సిగ్నేచర్ స్టైల్. కీర్తి సురేష్ ని సావిత్రి గారిలా నాగ అశ్విన్ ఆవిష్కరించిన తీరుకి అందరు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. దీని కోసం కాస్ట్యూమ్ డిజైనర్ గౌరంగ్ షా తన వంద మంది టీంతో కలిసి చేసిన కృషి తక్కువేమీ కాదు.

విడుదలకు 20 రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్ వేగం పెంచే పనిలో ఉంది వైజయంతి యూనిట్. ఇప్పటికే ట్రేడ్ నుంచి బిజినెస్ పరంగా మంచి ఆఫర్స్ రాగా శాటిలైట్ కోసం కూడా ఛానల్స్ ఫాన్సీ ఆఫర్స్ తో పోటీ పడుతున్నాయి. టాలీవుడ్ కు సంబంధించి ఒక నటుడు లేదా నటి జీవిత కథను ఆధారంగా చేసుకుని తీస్తున్న సినిమాగా దీని మీద పాత తరం ప్రేక్షకులు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సావిత్రి జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నారు. సమంతా-విజయ్ దేవరకొండ-దుల్కర్ సల్మాన్-ప్రకాష్ రాజ్-మోహన్ బాబు- నాగ చైతన్య తో పాటు భారీ తారాగణం నటిస్తున్న ఈ మూవీ కి సంగీతం మిక్కి జే మేజర్. ఇటీవలే విడుదలైన మూగ మనసులు ఆడియో ట్రాక్ టాప్ లిస్టులో చేరిపోయింది.

మరిన్ని ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి