Begin typing your search above and press return to search.
జీరో సైజ్ నుంచి తిరిగి బబ్లీ లుక్ కి షిఫ్ట్
By: Tupaki Desk | 7 Nov 2020 6:30 PM ISTనేను శైలజ.. నేను లోకల్ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది కీర్తి సురేష్. నవతరం హీరోలు తనకు హిట్లిచ్చినా అగ్ర హీరోలతో సినిమాలు మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. అయినా నిరాశపడక తనవంతు ప్రయత్నాల్ని ఈ ట్యాలెంటెడ్ నటి ఎప్పుడూ విడువలేదు. అందివచ్చిన మహానటి అవకాశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకుంది కీర్తి.
`మహానటి` చిత్రం వరకూ ఒకలా కనిపించిన కీర్తి ఆ తర్వాత మాత్రం అమాంతం షాకిచ్చే రూపంతో కనిపించింది. అటు బాలీవుడ్ ప్లాన్స్ కూడా మనసులోకి చేరడంతో వెంటనే జీరో సైజ్ కోసం పాకులాడింది. కానీ ఆ లుక్ ఈ అమ్మడికి ఏమంత కలిసి రాలేదని తాజా పరిణామం చెబుతోంది. కీర్తి బొద్దుగా ఉంటేనే అందం. ఎంతో ముద్దొచ్చేదని భావించిన అభిమానులు పీలగా మారిన రూపం చూసి తట్టుకోలేకపోయారు. అందుకే లేటెస్టు ఇంటర్వ్యూలో ఓ అభిమాని తన లుక్ ఛేంజ్ గురించి ప్రశ్నించారు. దానికి కమింగ్ సూన్.. అంటూ కవర్ చేసేసింది.
కమింగ్ సూన్ అని అంది అంటే సర్కార్ వారి పాటలో తిరిగి బొద్దుగా కనిపిస్తుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయ్. మరి దీనికి కీర్తి ప్రాక్టికల్ గా ఆన్సర్ ఇస్తుందేమో చూడాలి. అయినా తనకు సూట్ కాని గెటప్ ట్రై చేసి తప్పు చేసానని రియలైజ్ అయ్యింది కాబట్టి తప్పనిసరిగా అభిమానుల కోరిక తీరుతుందనే భావిద్దాం.