Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ తో కీర్తి సురేష్ లిప్ లాక్!

By:  Tupaki Desk   |   27 Feb 2023 8:00 AM GMT
నేచుర‌ల్ స్టార్ తో కీర్తి సురేష్ లిప్ లాక్!
X
కీర్తి సురేష్ గేర్ మార్చిన సంగ‌తి తెలిసిందే. 'స‌ర్కారు వారి పాట‌'తో అమ్మ‌డు కొన్ని కండీష‌న్లు చెరిపేసింది. ఆ సినిమాలో కాస్త డీ గ్లామ‌ర్ గా క‌నిపించి కుర్రాళ్ల‌లో కాక‌లు పుట్టించింది. అయినా స‌రే అమ్మ‌డు న‌టిగా బిజీ కాలేక‌పోతుంది. దీంతో ద‌స‌రా కోసం నిబంధ‌న‌ల్ని మ‌రింత‌గా స‌వ‌రించిన‌ట్లు వినిపిస్తుంది. ఈ సినిమాలో అమ్మ‌డు నాని తో ఏకంగా ఓ లిప్ లాక్ స‌న్నివేశంలోనే న‌టించిందిట‌. స‌రిగ్గా ఈసీన్ ఇంట‌ర్వెల్ ముందు ఓ భారీ ఫైట్ సీన్ త‌ర్వాత ఉంటుందిట‌.

వాస్త‌వానికి ఈ సీన్ స్ర్కిప్ట్ లో ముందు లేదుట‌. త‌ర్వాత ఓ భారీ యాక్ష‌న్ త‌ర్వాత రొమాంటిక్ సీన్ పెడితే క‌నెక్టింగ్ బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఇలా ఆలోచించి సీన్ రాసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే లిప్ లాక్ ప్ర‌పోజ‌ల్ కీర్తి ముందుకు వెళ్ల‌గానే ఆమె కూడా ఎలాంటి కండీష‌న్లు పెట్ట‌లేదుట‌. కాదు..కూడ‌దు..చేయ‌ను వంటి అన్స‌ర్స్ రాలేదుట‌. దీంతో అమ్మ‌డు కండీష‌న్లు దాదాపు చెరిపేసిన‌ట్లుగానే క‌నిపిస్తుంది. ఇది నిజ‌మైతే కీర్తి లో చోటు చేసుకున్న భారీ మార్పుగానే చెప్పాలి.

మ‌ల‌యాళ నటి మేన‌క కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు కెరీర్ ఆరంభంలో మ‌డి క‌ట్టుకున్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్కిన్ షోలు..పెద‌వి ముద్దులు..డీగ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండేది.

ఎన్ని కోట్లు ఆప‌ర్ చేసినా నో చెప్పేది. 'మ‌హాన‌టి' లాంటి సక్సెస్ తో వ‌చ్చిన గుర్తింపు తో అమ్మ‌డు కెరీర్ విష‌యంలో మ‌రింత క‌ఠినంగా వ్య‌వ‌రించింది. సెల‌క్టివ్ గా సినిమాలు చేయ‌డం..హీరోని బ‌ట్టి య‌స్ చెప్ప‌డం వంటివి చేసేది.

దీంతో అవ‌కాశాలు గ‌గ‌న‌మైపోయాయి. ఆ త‌ర్వాత మ‌హేష్ సినిమాలో కాస్త స్కిన్ షో చేసింది. తాజా స‌న్నివేశం తో కండీష‌న్లు అన్నిక‌రిగిపోయిన‌ట్లే క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం హీరోయిన్ గా తెలుగులో ద‌స‌రా ఛాన్స్ మాత్ర‌మే ఉంది. ఈ సినిమా స‌క్సెస్ తో పాటు డీ గ్లామ‌ర్ గా హైలైట్ అయితే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న భోళా శంక‌ర్ లో చెల్లెలి పాత్ర పోషిస్తుంది. త‌మిళ్ లో మాత్రం మూడు..నాలుగు సినిమాలు చేస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.