Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మహానటి ఓనం లుక్

By:  Tupaki Desk   |   13 Sep 2019 4:13 AM GMT
ఫోటో స్టొరీ: మహానటి ఓనం లుక్
X
కేరళ ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ ఓనం. ఫిలిం సెలబ్రిటీలలో చాలామంది కేరళీయులు ఉంటారు కాబట్టి వారందరూ ఓనం సంబరాల్లో మునిగిపోయారు. అలా సంబరాల్లో మునిగినవారిలో మహానటి కీర్తి సురేష్ కూడా ఉన్నారు. కేరళ భామ అయిన కీర్తి తెలుగువారిని తన నటనతో మెప్పించి భారీ గుర్తింపు సాధించిన సంగతి తెలిసిందే. కీర్తి రీసెంట్ గా ఓనం పండుగను జరుపుకోవడమే కాకుండా అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా క్రీమ్ కలర్ చీర గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి నవ్వులు రువ్వుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోల్లో తలలో పూలు తురుముకొని.. చేతులకు గాజులు.. నుదుటిన బొట్టుతో ఎంతో పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోంది. కీర్తి గతంలో కాస్త చబ్బీగా కనిపించేది కానీ ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. చీరకట్టులో కూడా నాజూకుగా కనిపిస్తోంది. ఫేస్ లో కూడా ఆ మార్పు తెలుస్తోంది. మరో ఫోటోలో కీర్తి తన అమ్మగారు మేనక సురేష్ తో కలిసి పోజిచ్చింది.

ఈ ఫోటోలకు స్పందనగా చాలామంది నెటిజన్లు కీర్తికి ఓనం శుభాకాంక్షలు తెలిపారు. "రియల్ కేరళయిజం".. "నీ క్యూట్ చబ్బీ ఫేస్ ను మిస్ అవుతున్నా".. "ట్రెడిషనల్ లుక్ భలే ఉంది".. అంటూ తమ స్పందనలు తెలిపారు. ఇక కీర్తి ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మలయాళంలో మోహన్ లాల్ సినిమా 'మరక్కార్: అరబికడలంటే సింహం' లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా అజయ్ దేవగణ్ తో 'మైదాన్' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.