Begin typing your search above and press return to search.
కీర్తి లో ఇంకా `మహానటి` హ్యంగోవర్?!
By: Tupaki Desk | 9 Dec 2018 4:59 AM GMTతనదైన అసమాన నట ప్రతిభ తో కెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలో నే స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకుంది కీర్తి సురేష్. నటి మేనక కుమార్తె గా బాలనటి గా పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ అమ్మడు భవిష్యత్ లో గొప్ప కథానాయిక అవుతుందని ఆనాడే గుర్తించారు. అందుకు తగ్గట్టే యుక్త వయసులో హీరోయిన్ అయిన అనతికాలంలో నే స్టార్‌డమ్ ని అందుకుని సౌత్ ని ఏల్తోంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి తన ఇమేజ్ ని ఆకాశమే హద్దుగా విస్తరించుకుంది. రూ.2కోట్ల నుంచి రూ.4కోట్లు అందుకునే కాస్ట్ లీ సౌత్ హీరోయిన్ గానూ తన పేరు వినిపిస్తోంది.
అయితే ఇంత స్థాయి వచ్చాక కీర్తి కోరి కష్టాలు కొని తెచ్చుకుంటోందా? పరిణతి తో కెరీర్ ని బ్యాలెన్స్ చేయకుండా తాను పట్టిన కుందేటి కి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందా? అంటే.. తాజా సన్నివేశం అలానే కనిపిస్తోందనేది సినీవిశ్లేషకుల విశ్లేషణ. కెరీర్ ఆరంభం నేను శైలజ, నేను లోకల్ లాంటి చిత్రాల్లో అందాల నాయికగా మైమరిపించింది. కుర్ర హీరోల తో పాటు పవన్ (అజ్ఞాతవాసి) లాంటి స్టార్ల సరసన నాయికగా మెప్పించి, అందరు అగ్రహీరోలకు యాప్ట్ అని కూడా సంకేతాలిచ్చింది. కానీ ఎందుకనో కీర్తి కెరీర్ తెలుగులో ఆశించినంత లేదు. ఈ భామ ఎందుకో అగ్రహీరోల సరసన అవకాశాలు అందుకోలేకపోతోంది. ఇప్పుడున్న స్టార్లలో ప్రభాస్- రామ్‌చరణ్- ఎన్టీఆర్- అల్లు అర్జున్ లాంటి స్టార్లు ఈ అందాల ఆడబొమ్మను పిలిచి అవకాశం ఇచ్చే సన్నివేశం కనిపించడం లేదు. దీంతో కీర్తి `మహానటి` చిత్రంతో ఎంత ఎత్తుకు ఎదిగినా తను అగ్రహీరోలకు ఆప్షన్ కాలేకపోయిందని అర్థమవుతోంది.
గత కొంతకాలంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ లో కీర్తి సురేష్ నటించనుందని వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకూ కన్ఫామ్ కానేలేదు ఎందుకో. ఇకపోతే కీర్తి తెలుగులో గ్లామరస్ పాత్రలకు నోనో అంటోందని ఓ సమాచారం. అయితే కీర్తి స్ట్రాటజీ తెలుగులో ఒకలా, తమిళంలో ఇంకోలా ఉంది. అక్కడ గ్లామరస్ పాత్రలకు ఎస్ అంటోంది. ఇప్పటికే పలువురు అగ్ర కథానాయకుల సరసన నటించింది. కానీ తెలుగులో మాత్రం గ్లామరస్ పాత్రలకు నో చెబుతోందట. తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా మహానటిగానే ఉండాలన్నది తన ఆలోచన అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఓ ప్రముఖ దర్శకుడు వినిపించిన లేడీ ఓరియెంటెడ్ కథ విని ఓకే చెప్పిందట. మళ్లీ నాయికా ప్రధాన పాత్రకు ఒప్పుకుందన్న మాటా వినిపిస్తోంది.
కీర్తి వ్యవహార శైలి ఇలా ఉండడంతో నే స్టార్ హీరోలతో ఛాన్సులు రావడం లేదంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటి కే కుర్రహీరోలు తనకు దూరం దూరంగా ఉంటున్నారు. అయినా పరిణతి తో ఆలోచిస్తే అనుష్క లాంటి అగ్ర కథానాయిక ఓ వైపు అరుంధతి- పంచాక్షరి- భాగమతి అంటూ నాయికా ప్రధాన పాత్రలు చేస్తూనే, గ్లామర్ పాత్రల్లో మైమరిపించింది. రమ్యకృష్ణ సైతం నీలాంబరిగా- అమ్మోరుగా- శివగామిగా ఇలా కెరీర్ ని గ్లామర్ పాత్రలతో పాటు నాయికాప్రధాన పాత్రలతోనూ బ్యాలెన్స్ చేసింది. వేగంగా ఎదగాల్సిన కీర్తి మాత్రం ఈ విషయంలో బ్యాలెన్స్ చేయలేకపోతోందని, ఇది అపరిపక్వత వల్లనే అంటూ ఫిలింసర్కిల్స్ లో డిబేట్ రన్ అవుతోంది. `మరక్కర్` అనే మలయాళ చిత్రం మినహా కీర్తి కి ఇప్పటివరకూ సరైన పెద్ద సినిమానే లేదు. అయినా కీర్తీ.. ఇంకా ఎందుకీ హ్యాంగోవర్?