Begin typing your search above and press return to search.

త‌స్సాదియ్యా! నువ్వెంత మ‌హాన‌టివైతే మాత్రం?

By:  Tupaki Desk   |   29 Sep 2018 7:26 AM GMT
త‌స్సాదియ్యా! నువ్వెంత మ‌హాన‌టివైతే మాత్రం?
X
ఒరాకిల్ వ‌ర్సెస్ మిరాకిల్‌ లా లేదూ ఈ ఫీటు! ఇంత‌కీ ఎవ‌రీ అమ్మడు? మ‌హాన‌టికి అచ్చు గుద్దిన‌ట్టుగా క‌నిపిస్తోంది? హెడ్‌ లైట్ సరిగా వెలుగుతుందో వెల‌గ‌దో.. బ్రేక్ స‌రిగా ప‌డుతుందో ప‌డ‌దో తెలీని ఆ లూనాని గుర్రం స‌కిలించిన‌ట్టు అలా గాల్లో లేపేసింది? ఎవ‌ర‌మ్మా ఈవిడ‌? ఫోటో చూడ‌గానే ఎవ‌రీ లేడీ పందెంకోడి? అని తెలుసుకోవాల‌నిపించ‌డం లేదూ?!

అవును.. ఈ అమ్మ‌డు మ‌హాన‌టినే. అస‌లు సిస‌లు ఒగ‌రు పొగ‌రు ఉన్న‌ మ‌హాన‌టి. పేరు కీర్తి సురేష్‌. హైటు.. వెయిటు.. అందం .. చందం.. హావ‌భావాల గురించి ప్ర‌త్యేకంగా వ‌ర్ణించాల్సిన ప‌నేలేదు. ఇప్ప‌టికే తెలుగు - త‌మిళ ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితం. సౌతిండియాలోనే బెస్ట్ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్‌ గా స్కైని ట‌చ్ చేస్తున్న కీర్తి మ‌రోసారి విశ్వ‌రూపం చూపించింది. ఇంకా `మ‌హాన‌టి` జ్ఞాప‌కాల నుంచి అభిమానులు బ‌య‌ట‌ప‌డ‌కుండానే అంత‌కుమించిన విజువ‌ల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇదిగో ఈ ఒక్క ఫోటో చాలు.. ఇంత‌కంటే డీటెయిల్డ్‌ గా చెప్పాల్సిన ప‌నేలేదు. కీర్తి న‌టించిన `పందెంకోడి 2` (సందెకోజి-2) ఈ అక్టోబ‌ర్‌లోనే రిలీజ్‌ కి రెడీ అవుతోంది. విశాల్‌ `పందెంకోడి` చిత్రంతో మీరా జాస్మిన్‌ కి ఎంత పేరొచ్చిందో - అంత‌కు ప‌దింత‌లు కీర్తి సురేష్ పేరు తెచ్చుకోవ‌డం ఖాయం అని అర్థ‌మ‌వుతోంది. `సందెకోజి 2` ట్రైల‌ర్ లో కీర్తి సాహ‌సోపేత‌మైన ఫీట్ మ‌తి చెడ‌గొడుతోంది. ఈ అమ్మ‌డు త‌న‌తో పాటే మ‌రో ఇద్ద‌రు కుర్రాళ్ల‌ను లూనా బ్రాండ్ టీవీఎస్ మెజెస్టిక్ ఎక్కించుకుని .. ఏం చేసిందండీ ఆ సాహ‌సం? అచ్చు గుద్దిన‌ట్టు మాస్‌ పందెంకోడిలా అద‌ర‌గొట్టేసింది. వెన‌క కూచున్న పాపానికి ఆ కుర్రాళ్ల గుండెకాయ‌లు గాల్లో తేల‌కుండా ఉంటాయా? మీరే చెప్పండి.. ఆ ముంద‌రి కాళ్ల‌ను గుర్రం అయినా అంత ఎత్తుకు లేప‌గ‌ల‌దా? అల్లంత‌ దూరం నుంచి జీప్‌ లో వెళుతున్న ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్ బాబాయ్‌ లకు కీర్తి ఫీట్ చూశాక‌ ఖంగు తిని చొక్కాలు త‌డిసిపోయి ఉండ‌వూ.. ద‌టీజ్ వై.. షి ఈజ్ మ‌హాన‌టి!!