Begin typing your search above and press return to search.

త‌న మ‌ద‌ర్ ని ఫ్రేమ్ లో అలా చూసి షాకైన కీర్తి

By:  Tupaki Desk   |   26 Sept 2021 4:07 PM IST
త‌న మ‌ద‌ర్ ని ఫ్రేమ్ లో అలా చూసి షాకైన కీర్తి
X
మ‌హానటిగా అభిమానుల గుండెల్లో నిలిచిన కీర్తి.. ప్ర‌ముఖ మ‌ల‌యాళ‌ న‌టి మేన‌క కుమార్తె అన్న సంగ‌తి తెలిసిందే. త‌న మాతృమూర్తితో అరుదైన ఫోటోగ్రాఫ్ ల‌ను కీర్తి ఇంత‌కుముందు చాలాసార్లు సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఇప్పుడు మ‌రో అరుదైన ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. కీర్తి సురేష్ ఇన్ స్టా వేదిక‌గా ఓ ఫోటోను తన అభిమానులతో పంచుకుంది. కీర్తి తల్లి మేన‌క‌ న‌టించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ `భ్రమమ్‌`లో ఫోటోగ్రాఫ్ అది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో భ్ర‌మమ్ స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి త‌న త‌ల్లిగారి అంద‌మైన ఫోటోని ఆశ్చర్యంగా చూస్తోంది.

``మా..! మీరు #భ్రమలోకంలో ఎలా ముగించారు?`` అన్న వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి జోడించింది కీర్తి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను కూడా ట్యాగ్ చేస్తూ.. నేను దీన్ని సరిగ్గా చూస్తున్నానా? అక్టోబర్ 7 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో భ్రమమ్ ప్రీమియర్ ల వరకు అభిమానులు వేచి ఉండాలి.. అని వ్యాఖ్యానించారు. భ్రమమ్ అనేది పాపుల‌ర్ బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ అంధాధున్ కి అధికారిక రీమేక్. ఈ చిత్రంలో రాశి ఖన్నా ఒక క‌థానాయిక‌. దీనికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ దర్శకత్వం వహించారు.

త‌ల్లి మేన‌క పాత్ర‌లో మ‌హాన‌టి

మ‌హాన‌టి త‌ర్వాత‌ కీర్తి సురేష్ కోలీవుడ్ లో బిజీ అయిన‌ సంగ‌తి తెలిసిందే. స‌ర్కార్ వారి పాట మిన‌హా తెలుగులో పెద్ద హీరోల‌తో సినిమాలేవీ లేవు. అయితే కోలీవుడ్ లో మాత్రం వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌లేదు. హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూనే సోలోగానూ స‌త్తాచాటే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో అమ్మ‌డికి ఓ అరుదైన అవ‌కాశం ల‌భించింది. త‌ల్లి మేన‌క న‌టించిన నెట్రిక‌న్ సినిమాలో త‌ల్లి పాత్ర‌ను పోషించే అవ‌కాశం కీర్తికి ద‌క్కింది. క‌న్న‌డ‌లో మేన‌క‌ నాటి క్లాసిక్ హీరోయిన్ల‌ల‌లో ఒక‌రు. త‌ల్లి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకునే కీర్తి తెరంగేట్రం చేసిన సంగ‌తి తెలిసిందే. ల‌క్కీగా ఇప్పుడు తల్లి న‌టించిన చిత్రంలోనే న‌టించే అవ‌కాశం వ‌రించింది. నేట్రిక‌న్ సీక్వెల్ చేయాల‌న్న‌ది ధ‌నుష్ డ్రీమ్. ఇటీవ‌లే ఆ విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసాడు.

ఇందులో హీరోగా న‌టించింది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. అంటే ధ‌నుష్ మామ అన్న మాట‌. ఇప్పుడు మామ న‌టించిన పాత్ర‌లోనే అల్లుడు న‌టించ‌డం..అటు త‌ల్లి న‌టించిన పాత్ర‌లో త‌న‌య న‌టించ‌డం యాధృచ్ఛికంగా జ‌రుగుతోంది. ధ‌నుష్-కీర్తి సురేష్ గ‌తంలో రైల్ సినిమాలో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక నెట్రిక‌న్ సీక్వెల్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? నిర్మాత ఎవ‌రు? అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది. ధ‌నుష్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబ‌ట్టి అత‌నే నిర్మాత‌గా వ్య‌వ‌రించ‌నున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

న‌య‌న్ నేత్రిక‌న్ వేరు..!

ఇక నేత్రిక‌న్ పేరుతో ఇటీవ‌లే న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో ఓ కొరియ‌న్ సినిమా రీమైకై విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌య‌న్ నేత్రిక‌న్ క‌థాంశం ఆస‌క్తిక‌రం. కొంద‌రు అమ్మాయిలు అబ్బాయిల‌ సమూహం నగరం నడిబొడ్డున బాగా పాపుల‌రైన‌ పబ్‌లో పార్టీ చేసుకుంటుంది. గ్యాంగ్ లోని అబ్బాయిలలో ఒకరు కొకైన్ ని స్వీక‌రించి.. ఆదిత్యను ప్రయత్నించమని బలవంతం చేస్తాడు. ఆదిత్య నిరాకరిస్తాడు. అతనికి తన సోదరి దుర్గా అక్క (నయనతార) నుండి నిరంతర కాల్ లు వస్తున్నాయని చెబుతాడు. ఓ ఎంక్వ‌యిరీలో ప‌బ్ నుంచి తిరుగు ప్రయాణంలో వారు కారు ప్రమాదానికి గురవుతారు. ఈ ప్ర‌మాదంలో ఆదిత్య చ‌నిపోగా దుర్గ కంటిచూపు కోల్పోతుంది. కంటిచూపు కోల్పోయిన దుర్గ సాహ‌సాలు ఎలాంటివి అన్న‌దే సినిమా. దర్శకుడు మిలింద్ రావు సంఘర్షణ నేప‌థ్యంలో ఆద్యంతం అద్భుతంగా తెరకెక్కించారు.