Begin typing your search above and press return to search.
కీర్తితో చాలా కష్టమయ్యేలా ఉందే
By: Tupaki Desk | 2 Feb 2017 11:35 AM GMTటాలీవుడ్లో తొలి సినిమా ‘నేను శైలజ’తోనే సూపర్ హిట్ కొట్టింది మలయాళ భామ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి అందం.. అభినయం రెండూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక నానితో కీర్తి జత కట్టిన ‘నేను లోకల్’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం కూడా పట్టేసింది కీర్తి. ఇంకా ఆమె రెండు మూడు భారీ సినిమాలకు కన్సిడరేషన్లో ఉంది.
ఐతే అంతా బాగుంది కానీ.. కీర్తి ఇప్పటిదాకా ఇటు తెలుగులో.. అటు తమిళంలో చేసినవన్నీ గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలే. చాలా వరకు పద్ధతిగానే కనిపించలేదు. ఆమెను ఎవ్వరూ కూడా గ్లామరస్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. అన్ని సినిమాల్లోనూ నిండైన దుస్తులతోనే కనిపించింది. పొట్టి దుస్తులు వేయలేదు. అంగాంగ ప్రదర్శనా చేయలేదు. తాజాగా విజయ్ లాంటి స్టార్ హీరో సరసన ‘భైరవ’ లాంటి మాస్ సినిమాలోనూ కీర్తి పద్ధతిగానే కనిపించింది. అలాంటి మాస్ సినిమాలో హీరోయిన్ ఇంత పద్ధతిగా కనిపించడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఇలా మడికట్టుకుని కూర్చుంటే ఇండస్ట్రీలో టాప్ రేంజిలో ఎంతో కాలం కొనసాగడం కష్టమే. గత రెండు మూడు దశాబ్దాల్లో స్టార్ హీరోయిన్లు చలామణి అయిన వాళ్లలో ఒక్క సౌందర్య తప్పితే.. అందరూ తమలోని గ్లామర్ కోణాన్ని చూపించిన వాళ్లే. ముందు కొంచెం పద్ధతిగా కనిపించినా.. తర్వాత కొంచెం కొంచెం వలువలు విడిచినవాళ్లే. ఐతే కీర్తి తీరు చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు. తాను గ్లామర్ షోకు రెడీ అయిన ఇప్పటిదాకా కనీసం హింట్ కూడా ఇవ్వలేదు కీర్తి. మరి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో చేయబోయే సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా.. ఏమైనా రూల్స్ బ్రేక్ చేస్తుందా అన్నది చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/