Begin typing your search above and press return to search.
కీర్తి సురేష్ ఈసారి పుకార్లపై మౌనమేలనోయి?
By: Tupaki Desk | 22 Jun 2020 6:00 PM ISTకొన్ని వారాల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ ప్రముఖ రాజకీయ నాయకుడి వారసుడిని వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ వార్తలు పెద్ద ఎత్తున మీడియాలో వచ్చిన నేపథ్యంలో కీర్తి సురేష్ ఇంకా ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించారు. ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించి ఎలాంటి ఆలోచన లేదు అంటూ కీర్తి సురేష్ ప్రకటించింది. దాంతో అవన్నీ పుకార్లే అనుకున్నారు. కాని మళ్లీ వస్తున్న పుకార్లతో పెళ్లి వార్తలు నిజమేనేమో అంటున్నారు.
జాతీయ మీడియాలో ఈసారి కీర్తి సురేష్ వివాహంకు సంబంధించిన కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన సినిమాలు కాకుండా కొన్ని సినిమాలు ఇంకా మొదలు పెట్టలేదు. అవన్నీ కూడా పూర్తి అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కీర్తి సురేష్ వివాహం జరిగే అవకాశం ఉందని ఆ వార్తల సారాంశం.
కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కూడా నటించేందుకు కాబోయే భర్త మరియు అతడి కుటుంబ సభ్యుల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అందుకే ఆమె పెళ్లికి రెడీ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ఈ పెళ్లి విషయమై చర్చలు జరుగుతున్నా కూడా ఆమద్య మీడియాలో వార్తలు వచ్చిన సమయంలో ఇంకా కన్ఫర్మ్ కాని కారణంగా కీర్తి సురేష్ కొట్టి పారేసేలా స్పందించింది. కాని ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలకు మౌనం వహిస్తుంది. కీర్తి సురేష్ ఆ కథనాలపై స్పందించకుండా మౌనంగా ఉంది కనుకే ఆమె పెళ్లి ఖాయం అయ్యిందనిపిస్తుందంటూ తమిళ సినీ జనాలు మరియు ప్రేక్షకులు కూడా అంటున్నారు.