Begin typing your search above and press return to search.
తెగ ఇబ్బంది పెట్టేస్తున్న పవన్ హీరోయిన్
By: Tupaki Desk | 21 Sep 2017 1:31 PM GMTనేటివ్ గా చెన్నై భామ అయినా.. మలయాళ పరిశ్రమ నుంచి వచ్చి టాలీవుడ్ లో పాగా వేసేసిన బ్యూటీ కీర్తి సురేష్. ఇప్పుడీ భామ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. అవి కూడా అన్నీ క్రేజీ ప్రాజెక్టులు.. స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్ ఈమే. మహానటి అంటూ సావిత్రి జీవితంపై తెరకెక్కుతున్న బయోపిక్ లో టైటిల్ రోల్ కూడా చేసేస్తోంది.
ఇవి తెలుగు సినిమాలు అయితే.. తమిళ్ లో సూర్యతో తానా సెరేంద్ర కూట్టం.. విక్రమ్ తో సామి2.. విశాల్ తో శాండాకోజి2(పందెంకోడి2) చిత్రాలలో కూడా యాక్ట్ చేస్తోంది కీర్తి. అన్నీ క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉండడం బాగానే ఉంటుంది కానీ.. అన్నీ సెట్స్ పై ఉన్న సినిమాలు కావడంతో వాటికి డేట్స్ అడ్జస్ట్ చేయడమే మహా కష్టం అయిపోతోందిట. ఇప్పటికే నిర్మాతలు ఈమెతో కాల్షీట్స్ విషయంలో తెగ ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. స్టార్ హీరోల కాల్షీట్స్ ఈమె కారణంగా వృథా అయిపోతున్నాయని కంప్లెయింట్స్ కూడా చేస్తున్నారట. అయితే.. ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది నేను లోకల్ భామ కీర్తి సురేష్.
ప్రస్తుతం ఒక్కో సినిమాకు 1.5 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తోందని ఓ టాక్. సౌత్ లోని అన్ని భాషల్లోనూ సినిమాలు తెగ చేసేస్తున్న ఈ బ్యూటీ.. కాల్షీట్స్ విషయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని చాలా మంది నిర్మాతలు భరించలేకపోతోన్నారట. ఇప్పటికే ఈమెతో మాటా మంతీ జరిపిన తర్వాత సినిమాల నిర్మాతలు.. కీర్తి వాలకం కారణంగా వేరే హీరోయిన్ ని వెతుక్కుంటున్నారని టాక్ వినిపిస్తోంది.