Begin typing your search above and press return to search.
తెలుగు ‘అంధాదున్'లో హీరోయిన్ ఎవరు...?
By: Tupaki Desk | 23 May 2020 5:30 PM GMTసినీ ఇండస్ట్రీలో ఇప్పుడు రీమేక్ ల పరంపర కొనసాగుతోంది. మన సౌత్ ఇండియా సినిమాల కోసం బాలీవుడ్ కాచుకొని కూర్చొని ఉంటే అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను మన వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్' మూవీ తెలుగు లో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆయుష్మాన్ ఖురానా రాధికా ఆప్టే టబు ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ లో నితిన్ హీరోగా నటించబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'భీష్మ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా చేస్తున్నాడు నితిన్. 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్ - కీర్తి సురేష్ లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం.
కాగా నితిన్ 'రంగ్ దే' సినిమా కంప్లీట్ అయిన వెంటనే 'అంధాదున్' తెలుగు రీమేక్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే హీరోయిన్ కోసం వేట సాగించిన చిత్ర యూనిట్ 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక మోహన్ మరియు కీర్తి సురేష్ లను పరిశీలుస్తున్నారట. 'గ్యాంగ్ లీడర్' సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయిన ప్రియాంక మోహన్ ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలో నటిస్తోంది. మరోవైపు వరుస సినిమాలు లైన్లో పెడుతూ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కీర్తి సురేష్. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనలైజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే హీరో నితిన్ మాత్రం మహానటి కీర్తి సురేష్ వైపే చూస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరూ 'రంగ్ దే' సినిమాలో కలిసి నటిస్తుండటం.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్రెష్ పెయిర్ గా గుర్తింపు రావడంతో నితిన్ ఓటు కీర్తి కే వేస్తున్నట్లు సమాచారం. మరి తెలుగు ‘అంధాదున్' లో రాధికా ఆప్టే పోషించిన క్యారెక్టర్ కి ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి.