Begin typing your search above and press return to search.
పొర విప్పుతున్న సర్పకన్యలా మెరిసింది
By: Tupaki Desk | 5 Sep 2022 4:26 AM GMTఅందం ప్రతిభ ఉండీ సరైన ఛాన్సుల్లేని బ్యూటీగా కీర్తి సురేష్ రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. మహానటి లాంటి క్లాసిక్ హిట్ లో నటించినా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ విజయాలేవీ తనకు లేవు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ సరసన నటించిన సర్కార్ వారి పాట తనకు బిగ్ బ్రేక్ నిచ్చింది. కొన్నేళ్లకు స్టార్ హీరో మహేష్ తనకు లక్కీ ఛామ్ గా మారి పెద్ద హిట్టిచ్చాడు. ప్రస్తుతం తన తదుపరి కెరీర్ పై సీరియస్ గా దృష్టి సారించింది ఈ బ్యూటీ.
కీర్తి సురేష్ తాజా ఇన్ స్టా పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. 29 ఏళ్ల కీర్తి అద్భుతమైన డిజైనర్ లుక్ తో మెరుపులు మెరిపించింది. ఈ డ్రెస్ డిజైన్ చూడగానే పాము పొరవిప్పుతోందా? అన్నట్టుగా ఎంతో సిమ్మిలారిటీస్ తో ఆకట్టుకుంది.
ప్రకృతి నుంచి.. కీటకాలు జంతుజాలం నుంచి.. సముద్ర జీవుల నుంచి స్ఫూర్తి పొంది డిజైనింగ్స్ రూపొందించడం నేటి ట్రెండ్. దీనికి తగ్గట్టే కీర్తి డిజైనర్ లుక్ అదిరిపోయిందని చెప్పాలి.
తనను ఈ డ్రెస్ సర్పకన్యలా ఆవిష్కరించింది. అలాగే లుక్ పరంగా కీర్తి పూర్తిగా సన్నజాజి తీగను తలపిస్తోంది. మెటాలిక్ గౌన్ లో కీర్తి ఎంతో సౌకర్యంగా ఫోజులిచ్చిన తీరు ఆకట్టుకుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సర్కార్ వారి పాట కెరీర్ లోనే పెద్ద హిట్ మూవీగా నిలిచింది. తదుపరి మలయాళంలో టోవినో థామస్ తో కలిసి విష్ణు జి రాఘవ్ దర్శకత్వం లో 'వాషి'లో నటించగా ఇది జూన్ 17న విడుదల కానుంది. మామన్నన్ అనే తమిళ పొలిటికల్ థ్రిల్లర్ లో ఫహద్ ఫాసిల్ తో కలిసి కీర్తి కనిపించనుంది.
నాని సరసన శ్రీకాంత్ ఓదెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దసరా'లోను నటిస్తోంది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న యాక్షన్-డ్రామా భోలా శంకర్ లో చిరుకి సోదరి పాత్రలో నటించనుంది. ఓ వైపు యువహీరోల సరసన కథానాయికగా నటిస్తూనే మరోవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెబుతోంది. చిరు కి సోదరిగా నటిస్తున్న కీర్తి అగ్ర హీరోలకు సహాయ నటిగా ఓకే చెప్పడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.