Begin typing your search above and press return to search.

#RRR కోసం నానికి నో చెప్పిందా?

By:  Tupaki Desk   |   22 Nov 2018 6:34 AM GMT
#RRR కోసం నానికి నో చెప్పిందా?
X
హీరోయిన్ గా కీర్తి సురేష్ ఇమేజ్ 'మహానటి' సినిమాతో పూర్తిగా మారిపోయింది. అంతకుముందే మంచి నటి అని పేరున్నప్పటికీ 'మహానటి' కీర్తి కెరీర్ లో మైల్ స్టోన్ గా మారింది. అందుకే తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. 'మహానటి' తర్వాత కీర్తి సినిమాలన్నీ తమిళంలోనే చేసింది. తెలుగులో ఒక్కటి కూడా సైన్ చెయ్యలేదు.

నాని-కీర్తి సురేష్ ఓ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. గతంలో వారు కలిసి నటించిన 'నేను లోకల్' బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. దీంతో నాని - చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా నిర్మాతలు కీర్తి కి హీరోయిన్ రోల్ ఆఫర్ చేశారట. కానీ కీర్తి మాత్రం ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. నాని సినిమాను కీర్తి రిజెక్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అలా అని డేట్స్ సర్దుబాటు చేయలేనంత బిజీగా ఉందా అంటే.. అదేమీ లేదు. మరి ఎందుకు నాని సినిమా ఆఫర్ ను తిరస్కరించింది?

దీనికి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR కారణం అని ఒక టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి - రాజమౌళి టీమ్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఒకవేళ ఫైనలైజ్ అయితే బల్క్ డేట్స్ కేటాయించాల్సి ఉంటుందని సమాచారం. అందుకే తనకు నాని మంచి స్నేహితుడయినా అతని సినిమాకు 'నో' చెప్పిందట. ఒక వేళ అది నిజమే అయ్యి జక్కన్న ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయితే మహానటి కి మహా జాక్ పాట్ తగిలినట్టే.