Begin typing your search above and press return to search.

మళ్లీ పవన్ కు మరదలి పాత్రలోనే

By:  Tupaki Desk   |   26 Dec 2017 11:04 AM IST
మళ్లీ పవన్ కు మరదలి పాత్రలోనే
X
టాలీవుడ్ లో కొంత మంది ప్రేక్షకులు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఫస్ట్ లుక్ చూసి కాన్సెప్ట్ అర్దమైపోయిందని అలాగే టీజర్ చూసి స్టోరీ లైన్ కూడా క్లియర్ గా అర్థమైపోయిందని కామెంట్స్ చేస్తుంటారు. ఈ తరహా కామెంట్స్ ప్రతి సినిమాకు వస్తుండేవే. అదే తరహాలో ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాపై కూడా కొన్ని అనుమానాలు వెలువడుతున్నాయి. టీజర్ లో కొన్ని షాట్స్ చూసి సేమ్ టూ సేమ్ అత్తారింటికి దారేదిలానే ఉంటుందని చెబుతున్నారు.

అయితే త్రివిక్రమ్ మాత్రం తన ప్రతి సినిమాను చాలా డిఫెరెంట్ గా చూపిస్తాడని అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు త్రివిక్రమ్ ఎవ్వరు కాపీ అనే ఛాన్స్ ఇవ్వడు. కానీ అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయ్యేవరకు కొన్ని రూమర్స్ తప్పేలా లేవు. లేటెస్ట్ గా వెలువడిన ఒక న్యూస్ ప్రకారం అయితే అనుమానానికి ఇంకా బలాన్ని కలిగిస్తోంది. అదేమిటంటే.. అత్తారింటికి దారేది సినిమాలో సమంత పాత్ర ఏమిటో అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి మరదలుగా అల్లరి పిల్లగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అదే తరహాలో కీర్తి సురేష్ పాత్ర కూడా ఉంటుందట. అజ్ఞాతవాసిలో కూడా కీర్తి పవన్ కళ్యాణ్ మరదలట. ఈ న్యూస్ తెలియడంతో రూమర్స్ కి ఇంకా బలం చేకూర్చినట్లు అయ్యింది. తప్పకుండా ఇది అత్తారింటికి దారేది 2 అని సోషల్ మీడియాలో ఓ వర్గం వారు కామెంట్స్ చేస్తున్నారు.

కానీ ఎన్ని అనుమానాలు వచ్చినా పవన్ సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఏ డోకా లేదు. అత్తారింటికి దారేది స్టైల్ లో సినిమా ఉంటుంది అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి త్రివిక్రమ్ మాయ ఎలా ఉంటుందో..