Begin typing your search above and press return to search.
తూచ్.. సూపర్ స్టార్ కు హీరోయిన్ కాదు.. చెల్లి!!
By: Tupaki Desk | 22 Dec 2019 3:28 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'దర్బార్' లో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రజనీ నటించబోయే సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ తో వరసగా నాలుగు సినిమాలు తెరకెక్కించిన దర్శకుడే ఈ శివ. రీసెంట్ గానే ఈ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంచుకున్నారని వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదట.
ఈ సినిమాలో కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటిస్తుందని సమాచారం. సహజంగా స్టార్ హీరోయిన్లు తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు చెల్లి పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. కానీ ఇది సూపర్ స్టార్ రజనీ సినిమా కావడంతోనే కీర్తి సురేష్ పెద్దగా ఆలోచించకుండా 'యస్' చెప్పేసిందట. ఎలాంటి నటీనటులకైనా రజనీకాంత్ సినిమాలో ఒక్కసారైనా నటించాలని ఉంటుంది. కీర్తి సురేష్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ సినిమా కోసమే మణిరత్నం సినిమా 'పోన్నియన్ సెల్వన్' నుంచి కీర్తి తప్పుకుందని కొలీవుడ్ టాక్.
ఈ సినిమాలో రజనీకి జోడీగా మీనా.. ఖుష్బూ నటిస్తున్నారట. #రజని168 గా పిలుచుకుంటున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని.. ఆగష్టులో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.