Begin typing your search above and press return to search.
కీర్తి సినిమాకి గుమ్మడికాయ కొట్టేశారు...!
By: Tupaki Desk | 6 Sept 2020 9:02 PM IST'మహానటి' కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్ గా ఎలా మారిందనే కథాంశంతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. 'లక్ష్మి' 'ధనిక్' వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నగేష్ కి ఇది ఫస్ట్ తెలుగు సినిమా. దిల్ రాజ్ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై సుధీర్ చంద్ర - శ్రావ్యా వర్మ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి 'గోలి రాజు' అనే పాత్రలో నటిస్తుండగా జగపతి బాబు - రమాప్రభ - రాహుల్ రామకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన 'గుడ్ లక్ సఖి' టీజర్ విశేషంగా ఆకట్టుకుంది.
కాగా లాక్ డౌన్ కి ముందే మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'గుడ్ లక్ సఖి' కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడంతో ఆరు నెలల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించారు. హైదరాబాద్ లో సింగిల్ షెడ్యూల్ లో మిగిలిన భాగం చిత్రీకరణ కంప్లీట్ చేసి గుమ్మడి కాయ కొట్టేసింది చిత్ర యూనిట్. ఇక నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ముగింపు దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.