Begin typing your search above and press return to search.
స్టార్ హీరో ప్రొడక్షన్ లో మహానటి
By: Tupaki Desk | 15 Aug 2021 1:30 AM GMT‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్ ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన తన కంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే దాదాపు స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది ఈ క్యూట్ హీరోయిన్. ప్రస్తుతం ఈమె తెలుగులో క్రేజీ ప్రాజెక్టు సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’లో హీరోయిన్ గా చేస్తోంది. ‘కళావతి’గా ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కనిపించబోతుండగా, ఇటీవల విడుదలైన సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఇకపోతే కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో కీర్తి నటించిన సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ భామ విలక్షణ నటుడు సూర్య మూవీలో మరో సారి నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘తానా సెందా కొట్టం’ చిత్రంలో సూర్య సరసన నటించిన కీర్తి సురేశ్ మరోసారి ఆయనతో నటించబోతుంది. ఆ చిత్రం తెలుగులో ‘గ్యాంగ్’ అనే టైటిల్ తో విడుదలయింది. మరోసారి ఆమె సూర్య మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కానీ, హీరో మాత్రం సూర్య కాదని తెలుస్తోంది.
జాతీయ అవార్డు గ్రహీత, ఫేమస్ డైరెక్టర్ బాల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా, దీనిని సూర్య నిర్మించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇందులో కీర్తిసురేశ్ మరియు అథర్వా లు జోడీగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంపైన అప్పుడే భారీ అంచనాలు నెలకొని ఉండగా, త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందట. ఇకపోతే కీర్తి సురేశ్ ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ‘మరక్కర్: అరేబియన్ సింహం’ చిత్రంలో ‘ఆర్చ’గా కనిపించనుంది కీర్తి.
తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తె’లోనూ కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు సూపర్ స్టార్ మహేశ్ ‘సర్కారు వారి పాట’లోనూ ఈ భామనే హీరోయిన్. మొత్తంగా ఒకే సారి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది కీర్తి సురేశ్. వీటితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ హీరోగా నటిస్తున్న ‘సాని కాయిధమ్’లోనూ కీర్తి కీ రోల్ ప్లే చేస్తోంది. దీంతో పాటు ‘వాశి’ అనే మలయాళ సినిమాలోనూ కీర్తి నటిస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఈ అమ్మడు దూసుకు పోతూ ఉంది.