Begin typing your search above and press return to search.

బంతిపువ్వులాంటి భామ బరువు పెరగాల్సిందే!

By:  Tupaki Desk   |   3 March 2021 1:30 AM GMT
బంతిపువ్వులాంటి భామ బరువు పెరగాల్సిందే!
X
భాష ఏదైనా .. కథ ఏదైనా .. హీరోయిన్ అందంగా ఉండాలనే ప్రేక్షకులు కోరుకుంటారు. తెరపై హీరోకి అనేక సమస్యలు ఉంటాయి. విలన్ వైపు నుంచి ఆయనకి అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి హీరో రిలాక్స్ అయ్యేలా చేసేది హీరోయిన్నే. ఇక అవతల తమ హీరో అంతలా ఫైట్లు చేస్తుంటే అభిమానులు కూడా రిలాక్స్ కావడానికి ఇష్టపడరు. తమ హీరో .. హీరోయిన్ తో కలిసి పాడుతూ రిలాక్స్ అవుతున్నప్పుడే వాళ్లు కూడా సేదతీరుతారు. అందువలన హీరోయిన్ అందంగానే ఉండాలని వాళ్లు భావిస్తుంటారు. ఆమె బిజీగా ఉండి ఒక పాట తక్కువేసుకున్నా అసంతృప్తి చెందుతుంటారు.

అయితే ముద్దుగా .. బొద్దుగా ఉండే హీరోయిన్లు కొంతమంది, నాజూకుగా కనిపించాలనే ఉద్దేశంతో కడుపు మాడ్చుకుని .. కసరత్తులు చేసి సన్నబడుతుంటారు. అలా సన్నబడిన వాళ్లను అభిమానులు శభాష్ అనేసిన సందర్భాలు లేనేలేవు. ఎవరు ఎలా ఆకట్టుకున్నారో .. అలాగే ఉండాలనేది వాళ్ల అభిప్రాయం. 'మహానటి'లో అచ్చు సావిత్రిలా కనిపించిందనీ .. సావిత్రిలానే అనిపించిందనే కితాబు కీర్తి సురేశ్ కి దక్కింది. అయితే సావిత్రిలా తాను చాలా లావుగా ఉన్నానని అనుకుందేమో, అప్పటి నుంచి కీర్తి సురేశ్ సన్నబడటం మొదలుపెట్టింది.

చాలా నాజూకుగా తయారైపోయాననుకుని 'మిస్ ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథాకథనాల సంగతి అటుంచితే, ఆమె పీలగా కనిపించడాన్ని అభిమానులు ఇష్టపడలేదు. సన్నజాజిలా కాదు .. బొండుమల్లెలా తయారైరమ్మని తేల్చి చెప్పేశారు. దాంతో ఆమె అప్పటి నుంచి ట్రై చేస్తూ మొత్తానికి కొంత దారిలో పడింది. ఆ విషయం తాజా పోస్టర్ల ద్వారా తెలుస్తూనే ఉంది. అయితే ఇంకా ఆమె బరువు పెరగాల్సిందేననే అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. 'సర్కారువారి పాట' సినిమాలో మునుపటి కీర్తి సురేశ్ ను చూడవచ్చునేమో