Begin typing your search above and press return to search.

ఎల్లోలో సర్కార్ భామ ముద్దబంతిలా మురిపిస్తోందిగా..!!

By:  Tupaki Desk   |   9 April 2021 1:30 PM GMT
ఎల్లోలో సర్కార్ భామ ముద్దబంతిలా మురిపిస్తోందిగా..!!
X
అందమైన భామలు సినిమాలలో ఎంత అందంగా కనిపిస్తారో బయట కూడా అంతే అందంగా మురిపిస్తారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ భామ కూడా ముందు వరుసలో ఉంటుంది. 'రంగ్ దే' బ్యూటీ కీర్తిసురేష్.. అందమైన హావభావాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోషూట్ లతో కుర్రకారు మనసులు దోచుకోవడంలో ముందే ఉంటుంది. ఈ వయ్యారి ఎల్లప్పుడూ నిండుగా పుత్తడిబొమ్మలా ముస్తాబై అభిమానులను దిల్ ఖుష్ చేస్తుంటుంది. కీర్తి మనోహరమైన సోయగాలు లక్షలాది అభిమానులను అలా ఆనందంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా అమ్మడు పసుపురంగు చీరలో దిగిన ఫోటో ఆమె అందాన్ని రెట్టింపు చేయడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

ప్రస్తుతం హాట్ హాట్ సమ్మర్ సీజన్ కావడంతో కీర్తి తేలికపాటి దుస్తులతో ఫోటోషూట్స్ చేస్తోంది. అలాగే ఈ వేసవిలో ధరించడానికి ఆమెకు ఫేవరేట్ కలర్స్ లో ఒకటైన పసుపురంగును ఎంచుకుంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలో కీర్తి.. అందమైన తేలికపాటి పసుపురంగు చీరతో నునువెచ్చని ఎండ వేడికి అలా సేదతీరుతున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే అమ్మడు పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్కులో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అలాగే ఫోటోతో పాటు.. "వేసవి రోజుల్లో పసుపు కన్నా మంచిది ఇంకేముంది..?" అంటూ కాప్షన్ జోడించింది అమ్మడు. ఈ ఫోటోలో కీర్తి ఎంబ్రాయిడరీ బోర్డర్ పసుపు చీరలో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే పూరేకుల డిజైన్ పొదిగిన ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తుంది. అలంకరణ తక్కువగా ఉంది. కానీ ఆ తక్కువలోనే అమ్మడు వెలిగిపోవడం మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.