Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ః కేరళ హాఫ్‌ సారీలో మెరిసి పోయింది

By:  Tupaki Desk   |   3 April 2021 3:46 AM GMT
పిక్‌ టాక్‌ః కేరళ హాఫ్‌ సారీలో మెరిసి పోయింది
X
'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్‌ ట్విట్టర్ లో షేర్‌ చేసిన ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కీర్తి అభిమానులు ఎక్కువ శాతం ఆమెను సాంప్రదాయ దుస్తుల్లోనే చూడాలనుకుంటూ ఉంటారు. ఆమె గతంలో షేర్‌ చేసిన సారీ పిక్స్ మరియు ట్రెడిషనల్‌ పిక్స్ నెట్టింట బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి కీర్తి సురేష్‌ ఈ హాఫ్‌ సారీలో మెరిసి పోతుంది. కేరళ సాంప్రదాయ వస్త్ర శైలి దుస్తుల్లో కీర్తి సురేష్ పద్దతిగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ఫొటోలతో కీర్తి సురేష్ మరోసారి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

గురువాయర్ టెంపుల్‌ లో దర్శనం. ఎట్టకేలకు నేను హాఫ్‌ సారీ కట్టుకున్నాను. ఈసారికి మా అమ్మ నా స్టైలిష్‌ గా మారిందంటూ ట్విట్టర్ లో ఫొటోలు షేర్‌ చేసింది. గోధుమ వర్ణంలో కేరళ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కీర్తి సురేష్ ను చూసి అభిమానులు వావ్‌ అనకుండా ఉండలేక పోతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలకు లక్షల్లో లైక్స్ వేలల్లో కామెంట్స్ పడుతున్నాయి. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే రంగ్‌ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో వైపు తెలుగు మరియు తమిళంలో ఈమె నటిస్తున్న సినిమాలు కొన్ని ఉండగా మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి సౌత్‌ లో టాప్ స్టార్‌ గా కీర్తి సురేష్‌ దూసుకు పోతుంది. ఇంత స్టార్‌ అయినా కూడా శృతి మించిన ఎక్స్‌ పోజింగ్‌ కు ఆమె దూరం. ఎక్కువ శాతం కీర్తి ఇలా పద్దతైన డ్రస్‌ల్లోనే కనిపిస్తూ ఉంటుంది.